Home ఆంధ్రప్రదేశ్ వార్తలు సిఎం జగన్ ఇంటికి సమీపంలో పేలుడు

సిఎం జగన్ ఇంటికి సమీపంలో పేలుడు

CM Jaganగుంటూరు : తాడేపల్లిలోని ఎపి సిఎం జగన్ ఇంటికి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున పేలుడు సంభవించింది. ఈ ఘటనలో పైడమ్మ అనే మహిళ తీవ్రంగా గాయపడింది. దీంతో పైడమ్మను విజయవాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాడేపల్లిలోని ప్రకాశ్ నగర్ లో ఉన్న ఇంట్లో ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ధాటికి ఆ ఇల్లు ధ్వంసమైంది. ఈ పేలుడు స్థానికంగా కలకలం రేపింది. దీంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. తాడేపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పేలుడుకు గల కారణాలు తెలియరాలేదు.

Explosion Near CM Jagan House In Tadepalli At Guntur