Thursday, April 25, 2024

రిజర్వేషన్ టికెట్ క్యాన్సలేషన్ సమయం పొడిగింపు

- Advertisement -
- Advertisement -

Extension of reservation ticket cancellation time

హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వేశాఖ గుడ్ న్యూస్ అందించింది. రిజర్వేషన్ టిక్కెట్ల క్యాన్సలేషన్ సమయాన్ని పొడిగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ప్రయాణ తేదీ నుంచి ఆరునెలల ఉన్న ఆ గడువును తాజాగా 9 నెలల వరకు పొడిగించింది. కరోనా కారణంగా పలు రైళ్లు రద్దయిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంటూ కీలక ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే 2020 మార్చి 21 నుంచి జూన్ 30 మధ్య ప్రయాణానికి రైల్వే కౌంటర్ల వద్ద రిజర్వేషన్ టికెట్లు బుక్ చేసుకున్న వారు తమ ప్రయాణ తేదీ నుంచి 9 నెలలోపు ఎక్కడి నుంచైనా రద్దు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఆరు నెలల సమయంలో రీఫండ్ కోసం చాలామంది దరఖాస్తు చేసుకున్నారని అందరికీ కూడా పూర్తిస్థాయిలో రీఫండ్ అందజేస్తామని రైల్వేశాఖ వెల్లడించింది.

Extension of reservation ticket cancellation time

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News