Thursday, April 25, 2024

కరోనా వైరస్ విరుగుడు మందులపై పరిశోధనలు జరుగుతున్నాయి

- Advertisement -
- Advertisement -

amithmishra

 

కోవిడ్ పై పోరాడేందుకే సిసిఎంబితో ఐస్టెమ్ బెంగళూర్ సంస్థ ఒప్పదం
సిసిఎంబి డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ప్రకటన

మన తెలంగాణ/హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ విరుగుడు మందులపై పరిశోధనలు జరుగుతున్నాయని, అయితే వ్యాక్సిన్ అందుబాటులోకి రావడానికి మరింత సమయం పట్టే అవకాశం ఉందని సిసిఎంబి( సెంటర్ ఫర్ సెల్యూలర్ అండ్ మాలిక్యూలర్ బయాలజి) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా పేర్కొన్నారు. కోవిడ్‌పై పోరాడేందుకు సిసిఎంబి హైదరాబాద్ ,ఐస్టెమ్ రీసెర్చ్ ప్రైవేట్ లిమిటెడ్ ల్యాబ్‌ల మధ్య ఒప్పందం కుదిరిందని ఆయన ప్రకటించారు. ఈ ఒప్పందం ప్రకారం కరోనా వ్యాధి నివారణకు సిసిఎంబి చేస్తున్న కృషిలో భాగంగా ఐస్టెమ్ ల్యాబ్ కూడా భాగస్వామ్యం కానుందని తెలిపారు. ఐస్టెమ్ వద్ద ఉన్న మానవ ఊపిరితిత్తుల ఎపిథీలియర్ కణాలను ప్రయోగించి కోవిడ్ 19 వైరస్ అణువులను, రోగ లక్షణాలపై పరీక్షించేందుకు ప్రత్యేక ప్రణాళికలు తయారు చేస్తున్నామన్నారు.

అదే విధంగా పరిశోధనశాలలో (ఇన్ విట్రోల) మందుల ప్రభావాన్ని గుర్తించడానికి హేతుబద్ధమైన ప్రతిపాదికను కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఈసందర్బంగా సిసిఎంబి డైరెక్టర్ డా రాకేశ్ మిశ్రా మాట్లాడుతూ..మానవుల్లో పెరిగే కరోనా వైరస్ కణాలను బయట పరిశోధనశాలలో వృద్ధి చేయడం అది పెద్ద సాంకేతిక సవాల్ అని పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రైవేట్, ప్రభుత్వ భాగస్వామ్యంతో దీనిని అధిగమిస్తామని వెల్లడించారు. ఐస్టెమ్ తయారు చేస్తున్న కణవ్యవస్థ ఎసిఇ2 గ్రాహకం ఇతర వైరస్ కణాలలో ప్రవేశించడానికి, వైరస్ ఉత్పత్తికి అవసరమైన ఇతర జన్యువులను వ్యక్త పరుస్తుందన్నారు.

ఈ కణవ్యవస్థను ఉపయోగించి డా కృష్ణన్ హర్షన్ నేతృత్వంలోని సిసిఎంబి బృందం ఊహిస్తున్న విధంగా వైరస్‌ను పెంచి, తద్వార ఔషధ, టీకాల అభివృద్దికి దోహదం చేస్తుందన్నారు. ఐస్టెమ్ ముఖ్య కార్యదర్శి డా జోగిన్ దేశాయ్ మాట్లాడుతూ..భారత దేశంలో ఓ ప్రముఖ శాస్త్రీయ సంస్థతో సంయుక్త పరిశోధనలు చేయడం తాము గౌరవంగా భావిస్తున్నామన్నారు. డా రాజర్షిపాల్ బృందం అభివృద్ధి చేసిన ఎసిఎస్ సెల్‌థెరఫీ, రోగనమూనాల తయారీలో ఐస్టెమ్ సంస్థకు లోతైన నైపుణ్యం ఉందని తెలిపారు. సిసిఎంబి ఈ వేదికను వినియోగించి దేశ, విదేశాల్లో మానవాళికి సహయపడే కరోనా పరిశోధనలను ప్రగతి పథంలో ముందుకు తీసుకువెళ్లాలని ఆయన కోరారు.

 

Eye Stem Bangalore Company Agreement with CCMB
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News