Friday, March 29, 2024

సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న ‘ఎఫ్ 3’..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: విక్టరీ వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా ‘ఎఫ్ 3’.  కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ సినిమాకు అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నట్లు ప్రకటించిన మూవీ మేకర్స్.. తాజాగా సంక్రాంతి బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. టాలీవు్ టాప్ స్టార్స్ సంక్రాంతి టార్గెట్ గా బరిలోకి దిగుతుండడంతో ఎఫ్ 3 మూవీ విడుదల తేదీని వచ్చే ఏడాది 2022, ఫిబ్రవరి 25కు మార్చారు. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ తెలియజేస్తూ.. ‘బొమ్మ ఎప్పుడ పడితే అప్పుడే మనకు నవ్వుల పండగ’ అంటూ మూవీ కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

కాగా, గత ఏడాది సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధంచిన ‘ఎఫ్ 2’కు ‘ఎఫ్ 3’ సీక్వెల్ గా వస్తోంది. అవే పాత్రలతో విభిన్న కథతో ఈ సినిమాను అనిల్ రావిపూడి రూపొందిస్తున్నారు.  ఈ సినిమాలో వెంకటేశ్ కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ కు జోడీగా మెహ్రీన్  నటిస్తున్నారు.  ‘ఎఫ్ 2’ సినిమాలో నటించిన నటీనటులతో పాటు ఈ సినిమాలో అదనంగా బొమన్ ఇరానీ, శ్రీకాంత్ అయ్యంగార్, సునీల్ నటిస్తున్నారు.  ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా కథ డబ్బు చుట్టూ తిరుగుతుందని వార్తలు వస్తున్నాయి.

F3 Movie in cinemas from 2022 Feb 25th

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News