Home తాజా వార్తలు ఫేస్‌బుక్ టీనేజీ యూజర్లకు శుభవార్త

ఫేస్‌బుక్ టీనేజీ యూజర్లకు శుభవార్త

fb

న్యూయార్క్: సోషల్ మీడియా అనగానే ముందుగా గుర్తుకు వచ్చేంది ఫేస్‌బుక్ మాత్రమే. యూజర్ల కోసం ఫేస్‌బుక్ రోజు రోజుకు ఆప్‌డేట్ అవుతూ వాళ్ల మననలను పొందుతోంది. యువకుల కోసం ఫేస్‌బుక్ కొత్త టాక్ యాప్‌ను ప్రారంభించనున్నట్లు సమాచారం. లైంగిక వేధింపులు, దోపిడీకి గురయ్యే యువకులను కాపాడేందుకు ఈ యాప్ ప్రవేశపెడుతున్నాట్లు ఎఫ్‌బి ఉన్నతాధికారులు తెలిపారు.

ఈ యాప్ ద్వారా తమ పిల్లలు ఏమి చేస్తున్నారో తెలుసుకోవచ్చు. అపరిచిత ఇంటర్ నెట్ యూజర్లను టాక్ ద్వారా నిరోధించవచ్చును. ఎఫ్‌బిలో మెయిన్ మెసెంజర్ యాప్‌లో సాఫ్ట్‌వేర్ కోడ్ జత చేసి ఉండటంతో యాప్ ద్వారా పిల్లల సంభాషణలను పూర్తిగా తల్లిదండ్రులు నియంత్రించ వచ్చును.