Home అంతర్జాతీయ వార్తలు ఆమెను వ్యభిచారంలోకి దింపిన ఫేస్‌బుక్ ప్రేమ

ఆమెను వ్యభిచారంలోకి దింపిన ఫేస్‌బుక్ ప్రేమ

Facebook-Chattingహైదరాబాద్: సోషల్ మీడియాలో ఎన్ని లాభాలు ఉన్నాయో అన్ని నష్టాలు ఉన్నాయి. సోషల్ మీడియాను మంచి పద్దతిలో ఉపయోగించుకుంటే మంచే జరుగుతోంది. చెడుగా ఉపయోగిస్తే చెడే జరుగుతోంది. ఫేస్‌బుక్‌లో మనకు తెలియని వాళ్లకు ఫ్రెండ్ రిక్వెస్ట్‌లు పెట్టకూడదు. మనకు తెలియకుండానే మన దేహాన్ని అమ్మి వేసే మోసగాళ్లు ఉంటారు జర జాగ్రత్త. ఢిల్లీలో జరిగిన ఓ సంఘటన చూస్తే కళ్లు బైర్లు కమ్ముతాయి. ఢిల్లీలో వసంత్‌కుంజ్ ప్రాంతానికి చెందని రాజు(35) ఉజ్బెకు చెందిన యువతి (26) ఫేస్‌బుక్ వేదికగా ప్రేమలో పడ్డారు. సంవత్సరం నుంచి ఇద్దరు ఫేస్‌బుక్‌లో ఛాటింగ్ చేస్తూ ప్రేమలో పడ్డారు. భారత్‌కు రండి ఇద్దరు కలిసి వ్యాపారం చేద్దామని యువతికి రాజు  ఆశ పెట్టాడు. దీంతో యువతి కొంత డబ్బు తీసుకొని రాజు దగ్గరికి వచ్చింది. ఉజ్బెన్ యువతిని హోటల్‌లో పెట్టి  పలుమార్లు అత్యాచారం చేసి పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. భారత్ విడిచి ఉజ్బెన్‌కు వెళ్లితే అత్యాచారం దృశ్యాలను ఆన్‌లైన్‌లో పెడుతానని బెదరించాడు. ఉజ్బెన్ యువతిని భార్య అంజలికి రాజు పరిచయం చేశాడు. అంజలి యువతి దగ్గర ఉన్న పాస్‌పోర్టు, డబ్బులు లాక్కొని, గదిలో బలవంతంగా బంధించింది. ఉజ్బెన్ యువతిని బలవంతంగా వ్యభిచార వృత్తిలోకి దింపి ఆమె దగ్గరికి విటులను పంపించేదని ఆమె వాపోయింది. శనివారం రాత్రి అంజలి దంపతుల నుంచి ఆమె తప్పించుకుని వసంత్‌కుంజ్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. పోలీసులు అంజలిని అరెస్ట్ చేశారు. అంజలి భర్త రాజు మాత్రం పరారీలో ఉన్నాడు. పోలీసులు అంజలి దంపతులపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.