Saturday, June 21, 2025

ప్రధానిపై అభ్యంతరకర పోస్ట్.. మండిపడ్డ బిజెపి నేతలు..

- Advertisement -
- Advertisement -

పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత కులమత బేధాలు లేకుండా ప్రతీ ఒక్కరు ఉగ్రవాదాన్ని అంతం చేయాలని కోరుతున్నారు. ఈ క్రమంలో అందరూ భారత్‌కు మద్దతు ఇస్తుండగా.. కొందరు మాత్రం తమ అక్కస్సును వెల్లగక్కుతున్నారు. అలాంటి ఘటనే తెలంగాణలోని రామడుగు మండలంలో చోటు చేసుకుంది. ప్రధాన మంత్రి(PM Modi) నరేంద్ర మోడీపై సోషల్‌మీడియాలో(Social Media) అభ్యంతరకర పోస్ట్ పెట్టడం తీవ్ర దుమారాన్ని రేపింది.

వివరాల్లోకి వెళితే.. రామడుగుకు చెందిన ఆర్టిసి డ్రైవర్ ఎంఎ ముజాహిత్ తన ఫేస్‌బుక్ ఖాతాలో ఓ ఎఐ ఫోటోని షేర్ చేశాడు. అందులో ప్రధాని చేతికి సంకెళ్లు ఉండగా.. వెనుక పాకిస్థానీ జవాన్లు నిలబడి ఉన్నారు. ఇదంతా ఓ జైలులో జరుగుతున్నట్లుగా ఆ ఫోటోలో ఉంది. ఇది చూసిన స్థానిక బిజెపి నేతలు తీవ్రంగా మండిపడ్డారు. ప్రధానమంత్రిని అవమానించడాన్ని ఖండిస్తూ.. శుక్రవారం పాదయాత్ర పోలీస్ స్టేషన్ వరకూ పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఎస్‌ఐని కలిసి ముజాహిద్‌పై వెంటనే కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వాళ్లు డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News