Home కామారెడ్డి ఆకాశం వైపు అన్నదాత చూపు

ఆకాశం వైపు అన్నదాత చూపు

Farmers

మనతెలంగాణ/దోమకొండ: వానమ్మ. వానమ్మ. వానమ్మ ఓక్కసారాన్న వచ్చి పోవ వానమ్మ అంటూ మండలంలోని అన్నదాతలు నింగి వైపు రైతులు చూస్తున్నారు. మండలంలోని అన్ని గ్రామాలలో రైతులు మొక్కజోన్న ,కంది,సోయ పంటలను సాగు చేశారు.గత 25 రోజుల నుండి మండలంలో రెండు వర్షాలు మాత్రమో కురియడంతో వివిధ కరాల పంటలను సాగు చేశారు.ప్రస్తుతం మొక్కజోన్న పంటలతో పాటు వివిధ రకాలపంటలు వర్షాలు లేక వాడిపోతున్నాయి.వరి నాట్లు వేసేందుకు రైతులు ప్రణాళిక సిధ్దం చేసుకుని ఎరువులను వేసి మడులలో పెద్దజనుము విత్తనాలు వేసి సిద్దంగా ఉంచారు. కాని వర్షాలు కురియకపోవడంతో కెజ్‌విల్స్‌తో దున్నడానికి రైతులు ఎక్కడ కనబడటంలేదు. బోర్లు కింద నాటు వేసేందుకు రైతులు ప్రణాళిక వేసుకున్నావారికి సైతం బోరు నుండి వచ్చే తక్కువ నీటితో రోజుకు రెండు గుంటలు కుడా తడవడం లేదని రైతులు వాపోతున్నారు.
వర్షకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్న వర్షాలు లేక మండలంలో రైతులు వ్యవసాయపనులకు దూరంగానే ఉన్నారు. వేసిన మొక్కజోన్న పంటలను సైతం అడవి పందులు ద్వసం చేస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మొక్కజోన్న పంటలను ఆడవి పందుల నుండి రక్షించుకొవాడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు. వేసిని పంటలు వాడిపోవడంతో మండలంలోని రైతులు ఆకాంశం వైపు చేస్తూ వాన దేవుడిని గుర్తు చేసుకుంటూ వానమ్మ వానమ్మ వానమ్మ ఓక్కసారాన్న వచ్చి పోవ వానమ్మ అంటూ మొక్కుతున్నారు.