Thursday, April 25, 2024

సిబిఐ అధికారులమంటూ వ్యాపారికి టోకరా

- Advertisement -
- Advertisement -

కోల్‌కత: పశ్చిమ బెంగాల్ కోల్‌కత నగర శివార్లలోని భవానీపూర్‌లో ఒక వ్యాపారి ఇంటిపై దాడి చేసిన నకిలీ సిబిఐ అధికారులు రూ. 30 లక్షల నగదు, బంగారు ఆభరణాలతో ఉడాయించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించి మోసపోయిన వ్యాపారి పోలీసులకు సమాచారం ఇవ్వగా ఆ నకిలీల కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. భవానీపూర్‌లోని రూప్‌చంద్ ముఖర్జీ లేన్‌లోని నాలుగంతస్తుల భవనంలో నివసించే 60 ఏళ్ల సురేష్ వాధ్వా అనే వ్యాపారి ఇంట్లోకి సోమవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో సిబిఐ అధికారులమంటూ ఆరేడుగురు వ్యక్తులు ప్రవేశించారు.

నేరుగా డబ్బు, నగలు భద్రపరిచే గదిలోకి ప్రవేశించిన వారు సోదాల పేరుతో వాటిని మూటగట్టారు. మరి కొన్ని గదులను సోదా చేసి ఏమీ దొరకపోవడంతో అక్కడ నుంచి పరారయ్యారు. ఆలస్యంగా జరిగిన మోసాన్ని గుర్తించిన సురేష్ వాధ్వా మధ్యాహ్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశాడు. ఇంట్లో కాని, ఇంటి బయట కాని సిసి కెమెరాలు ఏవీ లేకపోవడంతో నిందితుల గుర్తింపు పోలీసులకు కష్టంగా మారింది. రెండు, మూడు కార్లలో నిందితులు వచ్చారని, వారి కార్ల నంబర్లు కూడా అక్కడ ఎవరూ నమోదు చేయలేదని పోలీసులు చెప్పారు. సమీపంలోని మెయిన్ రోడ్డు వద్ద ఉన్న సిసి కెమెరాల సాయంతో కార్ల ఆచూకీని కనిపెట్టేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News