Tuesday, September 26, 2023

వరంగల్ లో నకిలీ సర్టిఫికేట్ల తయారి ముఠా గుట్టురట్టు..

- Advertisement -
- Advertisement -

వరంగల్: జిల్లాలో నకిలీ సర్టిఫికేట్ల తయారి ముఠా గుట్టురట్టైంది. మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి 12మంది ముఠా సభ్యులను అరెస్టు చేశారు. దేశంలో గుర్తింపు గల విశ్వవిద్యాలయాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికేట్లను తయారు చేసి విద్యార్థులను విదేశాలకు తరలిస్తున్నారు. పక్కా సమాచారంతో ముఠా స్థావరాలపై పోలీసులు దాడి చేసి.. నిందితుల వద్ద నుంచి నకిలీ సర్టిఫికేట్లు, ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు, ప్రింటర్లను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులపై కేసు నమోదు చేసి విచారించనున్నట్లు పోలీసులు తెలిపారు.

Fake Certificate issued Gang Arrested in Warangal

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News