Thursday, April 25, 2024

నకిలీ పత్తి విత్తనాల ముఠా అరెస్టు

- Advertisement -
- Advertisement -

Fake cotton seed gang arrested

 

పోలీసుల అదుపులో నలుగురు నిందితులు
2.8టన్నుల నకిలీ విత్తనాలు, ప్యాకెట్లు స్వాధీనం
స్వాధీనం చేసుకున్న వాటి విలువ రూ.50లక్షలు
వివరాలు వెల్లడించిన సిపి మహేష్ భగవత్

మనతెలంగాణ, హైదరాబాద్ : నకిలీ పత్తి విత్తనాలు విక్రయిస్తున్న ముఠాను ఎల్‌బి నగర్ ఎస్‌ఓటి, హయత్ నగర్ పోలీసులు, వ్యవసాయ అధికారులు కలిసి పట్టుకున్నారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.50లక్షల విలువైన, 2.8 టన్నుల విత్తనాలు, లేబుల్ కవర్లు స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్‌భగవత్ మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎపిలోని కర్నూలు జిల్లా, కోయిల్‌కుంట మండలం, కొత్తపేట గ్రామానికి చెందిన చింతల వెంకటేశ్వర్లు సీడ్ వ్యాపారం చేస్తున్నాడు. పెద్దదేవులపురం గ్రామానికి చెందిన పత్‌లవత్ కృష్ణ నాయక్ సీడ్ వ్యాపారం( పరారీలో ఉన్నాడు), పుట్ట వెంకటరమణ, సూర్యపేట కేంద్రానికి చెందిన నోముల వెంకన్న వ్యాపారం చేస్తునాడు, వంగాలగాణి అశోక్ మార్కెటింగ్ చేస్తున్నాడు.

ఐదుగురు కలిసి సులభంగా డబ్బులు సంపాదించాలని ప్లాన్ వేసి నకిలీ విత్తనాలు తయారు చేసి అమాయకులైన రైతులకు మాయమాటలు చెప్పి విక్రయిస్తున్నారు. విత్తనాల్లో నకిలీ విత్తనాలు మిక్స్ చేసి హైదరాబాద్ పరిసరాల్లో విక్రయిస్తున్నారు. బిళ్లా, పావనీ తదితర బ్రాండ్ల పేరుతో నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు. నగర శివారులోని బ్రాహ్మణపల్లిలో గోడౌన్ ఏర్పాటు చేసి నకిలీ విత్తనాలను నిల్వ చేశారు. నిందితులు గోడౌన్‌లో నకిలీ విత్తనాలను ప్యాకింగ్ చేస్తుండగా దాడి చేసి పట్టుకున్నారు. రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్, ఎస్‌ఓటి ఎడిసిపి సురేందర్ రెడ్డి పర్యవేక్షణలో వ్యవసాయ అధికారులు భూక్య సల్మాన్ నాయక్, ఇన్స్‌స్పెక్టర్ సురేందర్, రవికుమార్, సత్యనారాయణ, ఎస్సైలు దాడి చేశారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News