Home జోగులాంబ గద్వాల్ భారీగా పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు

భారీగా పట్టుబడిన నకిలీ పత్తి విత్తనాలు

Fake Cotton Seedsగట్టు (జోగులాంబ గద్వాల) : మండల పరిధిలోని లింగాపురం గ్రామంలో భారీగా నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఇక్కడ నకిలీ పత్తి విత్తనాలు తయారు చేస్తున్నారని  సమాచారం అందడంతో జిల్లా వ్యవసాయ అధికారులు,టాస్క్‌ఫోర్స్ సిబ్బంది జిల్లా వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, జిల్లా ఎస్పీ లక్ష్మీ నాయక్,డిఎస్పీ షాకీర్ ఉసేన్,సిఐ హనుమంతు,కేటీ దొడ్డి ఎస్‌ఐ బాలవెంకటరమణ ముమ్మరంగా ఇళ్ళల్లో సోదాలు నిర్వహించారు. 8వందల కేజీల వరకు నకిలీ పత్తి విత్తనాలు పట్టుబడ్డాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. నకిలీ పత్తి విత్తనాలను గట్టు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా డిఎస్పీ షాకీర్ ఉసేన్ విలేఖర్ల సమావేశం ఏర్పాటు చేశారు. గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు విత్తన ఆర్గనేజర్‌తో ఒప్పందం కుదుర్చుకుని పత్తి విత్తనాలు ప్రభుత్వ అనుమతి లేని బేస్ట్‌కాటన్ హైదరాబాద్ పేరుతో ముద్రించిన కవర్లలో పత్తి విత్తనాలు అమ్ముతున్నారని తెలిపారు. 1 కేజి ప్యాకింగ్ మిషన్‌తో ప్యాక్ చేస్తు కర్ణాటకకు తరలించి అమ్మి అక్రమ దారిలో విత్తనాలను అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని వెల్లడించారు.. 8 వందల కేజీల పత్తి విత్తనాలు పట్టుబడ్డాయని చెప్పారు. మార్కెట్లో 1వేయ్యి నుంచి 15వందల వరకు ధర పలుకుతుందని అధికారులు తెలిపారు. గత సంవత్సరం రైతులు పండించిన విత్తన పత్తి ఫెయిలైన విత్తనాలను తక్కువ రేటుకు కొనుగోళు చేసి వాటిని ఆరుగురు గ్రూపులుగా ఏర్పడి ముగ్గురు విత్తనాలు తయారు చేయడం, కవర్లలో ప్యాక్ చేయ్యడం మరో ముగ్గురు మార్కెట్‌లో అమ్మకానికి పంపించడం, బ్రాండ్ కాని విత్తనాలను బ్రాండ్ విత్తనాలుగా విత్తన ధుకాణాలకు తరలించి అమ్ముతున్నారని చెప్పారు.  ఆరుగురిలో ముగ్గురు పట్టుబడగా మరో ముగ్గురు పరారీలో ఉన్నారని,  వారినికూడా పట్టుకుంటామని డిఎస్పీ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఆయన వెల్లడించారు.

Fake Cotton Seeds Seized in Gattu