Home తాజా వార్తలు జైపూర్ లో నకిలీ నక్సల్స్ అరెస్టు

జైపూర్ లో నకిలీ నక్సల్స్ అరెస్టు

Arrestedమంచిర్యాల : ముగ్గురు నకిలీ నక్సల్స్ ను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఘటన జైపూర్ లో జరిగింది. నక్సల్స్ పేరుతో వీరు పలువురి నుంచి బలవంతపు వసూళ్లకు పాల్పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు. చెన్నూరు క్రాస్ రోడ్డు వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఈ ముగ్గురు నకిలీ నక్సల్స్ పట్టుబడ్డారు. వీరి నుంచి ఒక తుపాకీ, ఎనిమిది బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తన్నట్టు పోలీసులు తెలిపారు.

Fake Naxals Arrested In Jaipur At Mancherial