Home జనగామ నకిలీ పోలీసులు అరెస్టు

నకిలీ పోలీసులు అరెస్టు

Fake Policeజనగామ : జాతీయ రహదారులపై ఇసుక లారీల వద్ద అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్న నకిలీ పోలీసులను మంగళవారం ఉదయం అరెస్టు చేసినట్టు జనగామ పోలీసులు తెలిపారు.  ఆర్ టిఎ పోలీసు అధికారులుగా చెప్పుకొని ఈ నకిలీ పోలీసులు అక్రమ  వసూళ్లకు పాల్పడుతున్నారని పోలీసులు చెప్పారు. ఏడుగురు సభ్యుల ముఠాలో ముగ్గురిని అరెస్టు చేశారు. మరో నలుగురు నకిలీ పోలీసులు పరారీలో ఉన్నారని పోలీసులు వెల్లడించారు.  అరెస్టు అయిన ముగ్గురి నుంచి ఒక కారు, మూడు సెల్‌ఫోన్లు, రూ.2,600 నగదు స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు చెప్పారు. వీరిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Fake Police Arrest by Police in Jangaon district