Friday, April 26, 2024

నకిలీ పోలీసుల అరెస్ట్

- Advertisement -
- Advertisement -
Fake police arrested in Hyderabad
పోలీసుల పేరు చెప్పి దోచుకున్న నిందితులు

హైదరాబాద్: పోలీసుల మనిచెప్పి అమాయకుడి డబ్బులు, మొబైల్ ఫోన్‌ను దోచుకున్న నలుగురు నిందితులను రెయిన్‌బజార్ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. నిందితుల వద్ద నుంచి మొబైల్ ఫోన్, రూ.4,500 నగదు, రెండు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడిని గత నెల 28వ తేదీన అరెస్టు చేసి రిమాండ్‌కు పంపారు. పోలీసుల కథనం ప్రకారం….నగరానికి చెందిన సయిద్ ఇక్రముద్దిన్ అలియాస్ ఇక్రమ్ పటేల్, ఎండి ఇమాముద్దిన్ సైఫ్, ఎండి అయాన్ ఖాన్, సయిద్ అమీర్ వాజిద్ అలీ అలియాస్ వర్గా, సయిద్ వాసిఫ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తున్నారు.

బీహార్‌కు చెందిన బాధితుడు వాటర్ ట్యాంక్ సమీపంలోని దోశబండి వద్ద ప్లేట్లు కడిగే పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో బాధితుడు గత నెల 26వ తేదీన పనికోసం వెళ్తుండగా ఐదుగురు నిందితులు ఆపివేశారు. తాము పోలీసులమని చెప్పి బెదిరించారు. నీ రూము ఎక్కుడా అని ప్రశ్నించారు. వెంటనే బాధితుడి వద్ద ఉన్న మొబైల్ ఫోన్‌ను తీసుకున్నారు. పోలీసులని బయపడిన బాధితుడు వెంటనే తన రూముకు తీసుకుని వెళ్లాడు. అక్కడ ఉన్న పెట్టెలోని బాధితుడుదాచుకున్న డబ్బులు తీసుకున్నారు. అక్కడి నుంచి వెళ్తూ ఈ విషయం పోలీసులకు చెబితే చంపివేస్తామని బెదిరించారు. ఇన్స్‌స్పెక్టర్ ఆంజనేయులు, వీరప్రసాద్, కరుణకుమార్ దర్యాప్తు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News