Friday, April 19, 2024

నవోదయనగర్ పారిశ్రామికవాడలో నకిలీ పోలీసులు

- Advertisement -
- Advertisement -

Fake police in Navodaya Nagar industrial area

 

పట్టుకుని పోలీసులకు అప్పగించిన పారిశ్రామికవేత్తలు

మనతెలంగాణ/చర్లపల్లి : నవోదయనగర్ పారిశ్రామికవాడలో నకిలీ పోలీసులు వసూళ్లకు తెగబడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. మంగళవారం నవోదయనగర్ పారిశ్రామికవాడలో ఇద్దరు వ్యక్తులు తాము కుషాయిగూడ క్రైం బ్రాంచ్ పోలీసులమని పరిశ్రమల్లో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఓ పరిశ్రమ యాజమానికి అనుమానం వచ్చి పట్టుకుని కుషాయిగూడ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చేసరికి ఇద్దరు వ్యక్తులలో ఓ వ్యక్తి తప్పించుకుని పారిపోగా మరోవ్యక్తిని పోలీసులు పట్టుకుని విచారిస్తున్నారు. చర్లపల్లి డివిజన్ బిఎన్‌రెడ్డి నగర్, నవోదయనగర్ పారిశ్రామికవాడలలో పోలీసులమని కొంత మంది నకిలీ పోలీసులు వస్తున్నారని పారిశ్రామికవేత్తలు అప్రమత్తంగా ఉండాలని నవోదయనగర్ పారిశ్రామికవాడ అసోసియోషన్ కార్యదర్శి అనంద్ అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News