Wednesday, April 24, 2024

కల్తిపై కత్తి

- Advertisement -
- Advertisement -

ఐదుగురు సభ్యుల ముఠా అరెస్టు
సూర్యాపేట జిల్లాలో పోలీసుల దాడులు
హైదరాబాద్‌లోని వనస్థలిపురం కేంద్రంగా దందా జరుగుతున్నట్లు దర్యాప్తులో గుర్తింపు

మన తెలంగాణ/హైదరాబాద్/సూర్యాపేట: నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారన్న పక్కా సమాచారం మేరకు రూ.13 కోట్ల విలువ చేసే నకిలీ విత్తనాలతో పాటు ఐదుగురు సభ్యులతో కూడిన ముఠా సూర్యాపేట పోలీసులు గురువారం నాడు అరెస్ట్ చేశారు. సూర్యాపేట జిల్లాలో దాడులు చేసి భారీ మొత్తంలో విత్తనాలను సీజ్ చేశారు. పోలీసులు సీజ్ చేసిన మిర్చి, టమాట, బెండ, దొండ నకిలీ విత్తనాల విలువ సుమారుగా రూ.13 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎటువంటి అ నుమతులు, లైసెన్స్ లేకుండా మిరప విత్తనాలను విక్రయిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. సూర్యాపేట జిల్లా చింతలపాలెంలో నకిలీ విత్తనాలను విక్రయాలు జరుగుతున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో నకిలీ విత్తనాల విక్రయాలపై పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ చేపట్టగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. పలుచోట్ల డీలర్లను నియమించుకుని విత్తనాలు అమ్ముతున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ క్రమంలో ద్వారకా సీడ్స్ అకౌంటెంట్ యాదగిరి, రీజినల్ మేనేజర్ లక్ష్మారెడ్డి సహా నకిలీ విత్తనాలు తయారుచేసి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. మరొకరు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నగరంలోని వనస్థలిపురం కేంద్రంగా శివారెడ్డి అనే వ్యక్తి ద్వారకా సీడ్స్ పేరిట మిరప, టమాట, బెండ, దొండ సహా 15 రకాల నకిలీ విత్తనాలు తయారు చేస్తునట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నకిలీ విత్తనాల విక్రయంపై పోలీసు అధికారులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఇప్పటికే ఆ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పెద్దమొత్తంలో విత్తనాలు స్వాధీనం చేసుకున్న విషయం విదితమే.

Fake seeds selling gang arrested in Suryapet

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News