Monday, November 4, 2024

నకిలీ వెహికిల్ ఇన్సూరెన్స్ గ్యాంగ్ అరెస్టు: సిపి

- Advertisement -
- Advertisement -

Fake vehicle insurance gang arrest

హైదరాబాద్: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో నకిలీ ఇన్యూరెన్స్ గ్యాంగ్‌ను అరెస్టు చేశామని సిపి సజ్జనార్ తెలిపారు. నకిలీ వెహికిల్ ఇన్సూరెన్స్ గ్యాంగ్‌లో 11 మందిని అరెస్టు చేశామన్నారు. వివిధ కంపెనీలకు సంబంధించిన నకిలీ వెహికల్ ఇన్సూరెన్స్ కాపీలను 11 మంది ముఠా గల సభ్యులు తయారు చేస్తున్నారని, ఈ ముఠా పొల్యూషన్ సర్టిఫికెట్ పేరిట వాహనదారులను మోసం చేస్తున్నారని చెప్పారు. పొల్యూషన్ వెహికల్ నిర్వహణలో రమేష్ ప్రధాన సూత్రధారి అని, అతడి పాటు మరో తొమ్మిది మంది ముఠా సభ్యులను అరెస్టు చేశామన్నారు. నిందితుల వద్ద నుంచి రూ.50 వేల నగదు, 1125 ఇన్యూరెన్స్ పత్రాలు, మూడు పొల్యూసన్ టెస్టింగ్ వెహికల్స్, లాప్‌టాప్‌లు, ప్రింటర్లు, 11 మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ముఠా నుంచి వివిధ కంపెనీలకు చెందిన స్టాంపులు, ప్రింటర్లు సీజ్ చేశామని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News