Saturday, April 20, 2024

ట్రాఫిక్ చలాన్లపై అసత్య ప్రచారం

- Advertisement -
- Advertisement -

False propaganda on traffic challans

పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాల సీజ్‌పై
హైకోర్టు ఆదేశాలని సోషల్ మీడియాలో నకిలీ వార్తలు
అలాంటి ఆదేశాలు కోర్టు నుంచి రాలేదు
అసత్య ప్రచారం చేసిన వ్యక్తిపై చర్యలు
సైబరాబాద్ సిపి విసి సజ్జనార్

హైదరాబాద్: ట్రాఫిక్ చలాన్లపై సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు నిరాధారమని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ స్పష్టం చేశారు. పెండింగ్ చలాన్లు ఉన్న వాహనాలను సీజ్ చేసే అధికారం పోలీసులకు లేదని హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని ఓ న్యాయవాది సోషల్ మీడియాలో పెట్టిన మెసేజ్ వైరల్ అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ విసి సజ్జనార్ ఓ ప్రకటన విడుదల చేశారు. అసత్య ప్రచారం చేస్తూ వాహనదారులను కన్‌ఫ్యూజ్ చేస్తున్నారని తెలిపారు. ఈ నెల 11వ తేదీన హైకోర్టు రిట్ పిటీషన్‌పై ఆదేశాలు జారీ చేసిందని, వాహనం విడుదల చేయాలని పోలీసులకు రెండు వారాలలోపు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించిందని తెలిపారు.

సదరు న్యాయవాది నిఖిలేష్ తొగరి ఈనెల 19వ తేదీన రాజేంద్రనర్ ట్రాఫిక్ పోలీసులకు దరఖాస్తు చేసుకుని పెండింగ్ చలాన్ల డబ్బులు కట్టడంతో బైక్‌ను రిలీజ్ చేశామని తెలిపారు. ఈ విషయం దాచిపెట్టి అసత్య ప్రచారం చేస్తున్నాడని పేర్కొన్నారు. అసత్య ప్రచారం చేస్తున్న వ్యక్తిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. న్యాయవాది హైకోర్టు ఆదేశాలను మార్చి చెబుతున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ఈ మెసేజ్‌ను ప్రచారం చేస్తున్న వారు ఒకసారి హైకోర్టు ఆదేశాలను పరిశీలించాలని కోరారు. ఈ మెసేజ్‌ను సోషల్ మీడియాలో ఫార్వర్డ్ చేయవద్దని, ఇది పోలీసుల విధులకు ఇబ్బందిగా మారుతుందని అన్నారు. సెంట్రల్ మోటార్ వాహనాల చట్టం రూల్ 167, 1989 ప్రకారం ట్రాఫిక్ చలాన్లు పెండింగ్ ఉన్న వామనాలను సీజ్ చేసే అధికారం ట్రాఫిక్ పోలీసులకు ఉందని స్పష్టం చేశారు. ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారు వెంటనే చెల్లించాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News