Tuesday, November 29, 2022

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ తను నేను

- Advertisement -

TANU-NENUసంతోష్ శోభన్, అవికాగోర్ హీరోహీరోయిన్లుగా నిర్మాత రామ్మోహన్ దర్శకుడిగా మారి తెరకెక్కించిన చిత్రం ‘తను నేను’. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరో శోభన్ సినిమా గురించి మాట్లాడుతూ “రామ్మోహన్ ఈ సినిమా స్క్రిప్ట్ చదివినప్పుడు ఇది చాలా మంచి సినిమా అవుతుందనిపించింది. ఆయన నన్ను ఈ సినిమాతో హీరోగా చేశారు. ఒక మంచి కథ, మంచి కాన్సెప్ట్‌తో చేసిన ఈ సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది. రామ్మోహన్ తొలిసారిగా డైరెక్షన్ చేసినట్టు అనిపించలేదు. 30 సినిమాలు డైరెక్ట్ చేసినట్టుగా చాలా అద్భుతంగా సినిమా తీశారు. ఈ సినిమా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. కుటుంబ సమేతంగా చూడదగ్గ క్లీన్ మూవీ ‘తను నేను’. ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేస్తారు. నేను హీరోగా నటిస్తున్న తొలి సినిమా విడుదలవుతున్న సందర్భంగా ప్రభాస్, నాని, కృష్ణవంశీ, త్రివిక్రమ్, రవితేజ, ప్రభుదేవాలు నాకు బెస్ట్ విషెస్ చెప్పారు. అలాగే ఫస్ట్ కాపీ చూసి నాని, సురేష్‌బాబు, రాజ్‌తరుణ్ నన్ను ఎంతగానో ప్రశంసించారు”అని అన్నారు.

Related Articles

- Advertisement -

Latest Articles