Home రాష్ట్ర వార్తలు లిమ్కా బుక్‌లో కుటుంబ సర్వే

లిమ్కా బుక్‌లో కుటుంబ సర్వే

రాష్ట్ర ప్రభుత్వానికి లిమ్కా రికార్డ్ యోగ్యతా పత్రం

limca-surveyహైదరా బాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టా త్మకంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే (ఎస్‌కెఎస్) చరిత్ర పుట ల్లోకి ఎక్కింది. సమగ్ర కుటుంబ సర్వేను జాతీయ రికార్డుగా లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ తెలిపింది. ఈ మేరకు లిమ్కా రికార్డ్ ఎడిటర్ విజయ ఘోష్ రాష్ట్ర ప్రభుత్వానికి సర్టిఫికెట్ పంపారు. దేశంలో మరే రాష్ట్రంలో జరగని విధంగా, గతంలో ఎన్నడు లేని విధంగా ఒకేరోజు 4 లక్షల మంది ఉద్యో గులు 1.09 కోట్ల కుటుంబాల వివరాలను సేకరించిందని సంస్థ తెలిపింది. ఉదయం ఏడు గంటల నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు ఈ సర్వే నిర్వహించారని సంస్థ తెలిపింది. కుటుంబ సభ్యుల పేర్లు, వయస్సు, విద్యార్హతలు, వృత్తులు, ఆధార్ నెంబర్లు, బ్యాంకు ఖాతాలు, ఆస్తిపాస్తుల వివరాలన్ని సేకరించారని, రాష్ట్ర ప్రజల ఆర్థిక స్థితిగతులను తెలుసుకోవాడానికి ఈ సర్వే ఎంతో ఉపయోగాపడిందని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ సంస్థ తెలిపింది.