Tuesday, July 8, 2025

ప్రముఖ సైకాలజిస్ట్ బివి పట్టాభిరామ్ కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ప్రముఖ సైకాలజిస్ట్, వ్యక్తిత్వ వికాస నిపుణులు బివి పట్టాభిరామ్ (75) (BV Pattabhiram) కన్నుమూశారు. సోమవారం ఆయన గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ‘రావ్ సాహెబ్’ భావరాజు సత్య నారాయణ సంతానంలోని 15 మంది ఒకరు పట్టాభిరామ్. కౌమార దశలో కాలి వైకల్యంతో నూన్యత భావాన్ని జయించి తానని తాను ఇంద్రజాలికుడిగా, రచయితగా తీర్చిదిద్దుకున్నారు. కాకినాడలో చదువుతున్న రోజుల్లో ఎంబేర్ రావు అనే ఇంద్రజాలికుడి దగ్గర ఆ విద్యను నేర్చుకున్నారు.

1970 నాటికి ఆయన (BV Pattabhiram) పూర్తిస్థాయి ఇంద్రజాలకుడిగా ఎదిగారు. 1984లో హైదరాబాద్‌లో కళ్లకు గంతలు కట్టుకొని రవీంద్ర భారతి నుంచి చార్మినార్ వరకూ స్కూటర్ నడిపి. ఇంద్రజాల విద్యలో తెలుగునేలపై కొత్త అధ్యాయాన్ని లిఖించారు. ఆ తర్వాత తన వద్ద ఉన్న విద్యతో ప్రజలకు ఎంతో మేలు చేశారు. దూరదర్శన్‌లో కొన్ని సీరియల్స్‌తో పాటు పలు సినిమాల్లో ఆయన నటించారు. ఇక పట్టాభిరామ్‌కు భార్య జయ, కుమారుడు ప్రశాంత్ ఉన్నారు. పట్టాభిరామ్ భార్య కూడా వ్యక్తిత్వ వికాస నిపుణురాలిగా పేరు పొందారు. ఖైరతాబాద్‌లోని స్వగృహంలో ఆయన పార్థివదేహాన్ని ఉంచారు. బుధవారం ఉదయం 9 గంటల నుంచి అభిమానుల సందర్శనార్థం అక్కడ ఉంచనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు మహా ప్రస్థానంలో పట్టాభిరామ్ అంత్యక్రియలు జరగనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News