Home తాజా వార్తలు శ్రీదేవి మృతిపై సిబిఐ విచారణ చేయాలి : అభిమానుల ఉద్యమం

శ్రీదేవి మృతిపై సిబిఐ విచారణ చేయాలి : అభిమానుల ఉద్యమం

Fans Demand For CBI Enquiry On Actress Sridevi Deathముంబయి : అతిలోక సుందరి, అందాల తార శ్రీదేవి మృతిపై సిబిఐ విచారణ చేయించాలని డిమాండ్ చేస్తూ ఆమె అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఉద్యమం చేపట్టారు. 2018 ఫిబ్రవరి 24న శ్రీదేవి దుబాయ్ లోని తన హోటల్ గదిలో ఉన్న బాత్ టబ్ లో పడి చనిపోయిన విషయం తెలిసిందే. ఆగస్టు 13న శ్రీదేవి జయంతి. ఈ నేపథ్యంలో ఆమె అభిమానులు నెట్టింటిలో ’సిబిఐ ఎంక్వైరీ ఫర్ శ్రీదేవి అంటూ ఓ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేయడం ప్రారంభించారు. అయితే శ్రీదేవి మృతిపై అనుమానాలు ఉన్నాయని, అందుకే ఆమె మరణంపై సిబిఐ విచారణ చేయించాలని ఆమె అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ఆమె మృతిపై సిబిఐ విచారణ చేయాలంటూ అభిమానులు చేస్తున్న డిమాండ్ కు కారణం ఉంది. గత జూన్ లో బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. ఆయన మృతిపై సిబిఐ విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే శ్రీదేవి మృతిపై కూడా సిబిఐ విచారణ చేయాలని ఆమె అభిమానులు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.