Thursday, March 28, 2024

పూజా హెగ్డే పుట్టిన రోజు.. సోషల్ మీడియాలో అభిమానుల హంగామా

- Advertisement -
Fans wishing Pooja Hegde happy birthday
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర హీరోలందరితో జోడి కడుతూ అగ్రపీఠం వైపు దూసుకుపోతున్నారు పూజా హెగ్డే. అక్టోబర్ 13 ఈమె జన్మదినం. ఈ సందర్భంగా అభిమానులు సోషల్ మీడియాలో ఆమెకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అలాగే ఇండస్ట్రీలోని ప్రముఖులు, శ్రేయోభిలాషులు ఆమెకు బర్త్ డే విషెస్ చెప్తున్నారు. తెలుగు, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ నెంబర్ వన్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు పూజా హెగ్డే. స్టార్ హీరోలందరితో నటిస్తూ చాలా బిజీగా ఉన్నారు ఈ ముద్దుగుమ్మ.  ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్.. అల్లు అర్జున్, త్రివిక్రమ్ సినిమాతో పాటు అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు పూజా హెగ్డే. ఇలాంటి పుట్టినరోజులు ఇంకా ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అభిమానులు.
- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News