Thursday, April 25, 2024

సంస్కరణలు కొత్తగా వచ్చినవి కాదు

- Advertisement -
- Advertisement -

Farm laws were long-waiting reforms

న్యూఢిల్లీ: సంస్కరణలు అనేవి కొత్తగా వచ్చినవి కాదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. కార్మిక చట్టంలో అనేక సంస్కరణలు తీసుకువస్తున్నామని సీతారామన్ తెలిపారు. కరోనా మహమ్మారిపై పోరాటం చేస్తూనే సంస్కరణలు చేపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులకు ఎలాంటి నష్టం ఉండదని భరోసా కల్పించారు. రైతులు ఇక తమ ఉత్పత్తులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని చెప్పారు. కొత్త వ్యవసాయ చట్టాల వల్ల రైతులు సంతోషంగా ఉంటారన్న ఆమె వివిధ చోట్ల పన్ను కట్టే బాధ రైతులకు తప్పుతుందన్నారు.

ప్రస్తుతం మార్కెట్ యార్డులు, మధ్యవర్తులకు పన్నులు కట్టాల్సి వస్తుందని చెప్పుకొచ్చారు. కొత్త వ్యవసాయ చట్టాల ద్వారా ఎవరికీ పన్ను కట్టాల్సిన అవసరం లేదన్నారు. మధ్యవర్తుల ప్రమేయం లేని వ్యవస్థను తెస్తున్నామని వివరించారు. రైతుకు వస్తున్న ఆదాయంలో 8శాతం వరకు పన్నులే కట్టాల్సి వస్తుంది. గతంలో వరి, గోదుమలకే కనీస మద్దతు ధరలు ఇచ్చారు. బిజెపి ప్రభుత్వం 22 పంటలకు కనీస మద్దతు ధరలు ఇస్తుందన్నారు. గతంతో కూరగాయలు పండించే రైతులకు గిట్టుబాటు ధరలు దక్కలేదు. గిట్టుబాటు ధరలు దక్కక రహదారిపైనే వదిలివెళ్లే పరిస్థితి ఉండేది. ఆహార ఉత్పత్తుల రంగానికి ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోందని మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.

Farm laws were long-waiting reforms

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News