Home జయశంకర్ భూపాలపల్లి పైసలిస్తేనే పాసు బుక్కులు…

పైసలిస్తేనే పాసు బుక్కులు…

Farmers

ములుగు: రైతు శ్రమను దోచుకుంటున్న రెవెన్యు అధికారులు , పైసలిస్తేనే పాసు బుక్కులు అని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని సోమవారం తహసీల్దార్ కార్యాలయం ముందు రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ మండలంలో రైతులు విఆర్‌ఓల చుట్టు తిరిగిన కానీ రైతుల సమస్యలు తీరడం లేదని రైతులు దరఖాస్తులు ఎన్ని ఇచ్చిన కానీ అవి చెత్తకుప్పలోనే పడుతున్నాయి. కానీ ఇప్పటి వరకు రైతులకు 1 బి, పట్టా పాసు పుస్తకాలు ఇవ్వలేదని రైతు సంఘం ములుగు జిల్లా కార్యదర్శి ఎండి గఫూర్ పాషా అన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మండలంలోని రైతుల వద్ద విఆర్‌ఓలు డబ్బులు తీసుకుంటు కార్యాలయాల చుట్టు తిప్పుతున్నారే తప్పా ఇప్పటి వరకు రైతులకు పట్టా పాసు పుస్తకాలు చేసిన దాఖలాలు లేవని అన్నారు. పేద రైతులను ఇబ్బందులకు గురి చేస్తు శ్రమ దోపిడి చేయడం సరికాదని ఇది ఖచ్చితంగా సంబంధిత అధికారులు వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఖరీఫ్ కౌలు రైతులకు కార్డులు ఇచ్చి రైతు పథకం అమలు చేయాలని, నాలుగు వేల కోట్లతో మార్కెట్ స్వీకరణ నిధిని ఏర్పాటుచేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. గత మూడు సంవత్సరాల క్రితం మీసేవ కేంద్రంలోకి దరఖాస్తు చేసుకున్నప్పటికి సాదా బైనామాలో మీ సేవల ద్వారా అప్లై చేసుకున్న దరఖాస్తులు ఇప్పటి వరకు పూర్తి కాలేదని అన్నారు. ఇప్పటికైన రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా రైవెన్యు అధికారులు వెంటనే పాసు పుస్తకాల పనులు చేపట్టి త్వరగా ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర కమిటి సభ్యులు ఎండి అమ్జద్ పాషా,  పరమ్ సింగ్, సదానందం తదితరులు పాల్గొన్నారు.

Farmer community leaders Protest At MRO Office