Home తాజా వార్తలు బ్యాంకు అధికారుల వేధింపులు.. గుండె పోటుతో రైతు మృతి

బ్యాంకు అధికారుల వేధింపులు.. గుండె పోటుతో రైతు మృతి

Farmer

 

రంగారెడ్డి : రుణాలు చెల్లించాలంటు బ్యాంకు అధికారులు తరుచు వేదించడం వల్ల రైతు గుండె పొటుతో మృతి చెందినాడు. ఈ సంఘటన మంచాల మండల పరిధిలోని బొండకొండ గ్రామంలో చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. బొండకొండ గ్రామానికి చెందిన రైతు జాటోతు రాములు బొండ కొండ గ్రామంలోని దక్కన్ గ్రామీణా బ్యాంకులో గతంలో రుణం తీసుకున్నాడు. పంటలు పండక పోవడంతో పంట రుణం బ్యాంకుకు చెల్లించలేదు.

దీంతో బ్యాంకు అధికారులు రైతు రాములు పై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసిన మంచాల పోలీసులు ఇటీవల రైతు రాములపై కేసు నమోదు చేసి జైలుకు పంపినారు. ఇటీవల జైలు నుంచి వచ్చిన అనంతరం మళ్లీ రైతు రాములుపై బ్యాంకు అధికారులు బ్యాంకు నుంచి తీసుకున్న రుణం చెల్లించాలని ఇబ్బందులకు గురిచేయడంతో అవేదనకు గురైన రైతు రాములు శుక్రవారం గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. మంచాల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Farmer died of due to Harassment of Bank officials