Home తాజా వార్తలు విద్యుత్ షాక్ తో రైతు మృతి

విద్యుత్ షాక్ తో రైతు మృతి

Farmer-Died-with-Current-Sh

నల్లగొండ: విద్యుత్ షాక్ తో రైతు మృతి చెందిన ఘటన నల్లగొండ జిల్లాలోని నిడమనూరు మండలం వంగాలగూడెం గ్రామంలో బుధవారం ఉదయం చోటుచేసుకుంది. సింగం పరమేశ్ (35) అనే రైతు వ్యవసాయ పొలం వద్ద మోటార్ వేసేందుకు వెళ్లి కరెంట్ షాక్‌తో దుర్మరణం చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇంటని పోషించే పెద్ద కోల్పోవడంతో ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.  పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.