Home తాజా వార్తలు విద్యుత్‌షాక్‌తో రైతు మృతి…

విద్యుత్‌షాక్‌తో రైతు మృతి…

Farmer

 

శివ్వంపేట : శివ్వంపేట మండలం పోతులగూడలో విద్యుత్‌షాక్‌తో రైతు మృతిచెందిన సంఘటన చోటు చేసుకుంది. సోమవారం పోతులగూడ గ్రామానికిచెందిన మంద పోచయ్య(45) అనే రైతు తన పొలం పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌కు కరెంట్ సరఫరా కాకపోవడంచే అక్కడ ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను బంద్ చేసి ఆయా విద్యుత్ స్థంభాలను చెక్ చేస్తూ ఉండగా ఒక స్థంభం వద్ద తీగతెగిపోవడంతో దానిని సరి చేస్తున్నాడు. ఇది గమనించని వేరే ఒక రైతు ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆన్ చేయడంతో విద్యుత్‌షాక్ తగిలి ఆ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

అతనికి పెళ్లిడుకొచ్చిన ఒక కూతురు, ఒక కొడుకు ఉన్నారు. రైతు చనిపోవడంతో అతని కుటుంబం వీదినపడ్డారు. అతని కుటుంబం సభ్యుల మేరకు స్థానికుల పోలీసులు విద్యుత్ అధికారులు సంఘటన స్థలాన్ని సందర్శించి కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం నర్సాపూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. చనిపోయిన ఈ బీద రైతును ప్రభుత్వం ఆదుకోవాలని పోతులగూడ సర్పంచ్ హరికిషన్‌రావు, మండల కోఆప్షన్ మెంబర్ లాయక్, ఎంపిటిసి సత్తిరెడ్డిలు ప్రభుత్వాన్నికోరారు. విద్యుత్ శాఖ ఏఈ బాబును వివరణ కోరగా విద్యుత్ షాక్‌తో మృతిచెందిన వారికి పోస్టుమార్టం రిపోర్టులో ఇచ్చినట్లయితే ప్రభుత్వపరంగా ఆర్థిక సహయం అందుతుందని తెలిపారు.

Farmer Died with Electrocution