Home జయశంకర్ భూపాలపల్లి పిడుగుపాటుకు రైతు మృతి

పిడుగుపాటుకు రైతు మృతి

Farmer Died With Thunderstorm In Muluguములుగు : ములుగు మండల పరిధిలోని ఖాసీందేవిపేటలో మంగళవారం విషాదం నెలకొంది. పిడుగుపాటుతో రంజాన్(65) అనే రైతు చనిపోయాడు. మంగళవారం ములుగు జిల్లాలో అకాల వర్షం పడింది.  మిర్చి, వరి ధాన్యం తడుస్తుందన్న ఆలోచనతో రంజాన్ పొలం వద్దకు వెళుతుండగా ఒక్కసారిగా పిడుగుపడింది. దీంతో రంజాన్ ఘటనాస్థలిలోనే చనిపోయాడు. నిరుపేద రంజాన్ కుటుంబాన్ని ఆదుకోవాలని ఖాసీందేవిపేట ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు. పోస్టుమార్టం నిమిత్తం రంజాన్ మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.