Home కుమ్రం భీం ఆసిఫాబాద్ భూ సమస్య పరిష్కరించాలంటూ రైతు ఆందోళన…

భూ సమస్య పరిష్కరించాలంటూ రైతు ఆందోళన…

Land Issue

 

చింతలమానేపల్లి: భూ సమస్యలు పరిష్కరించా లం టూ గురువారం సాయంత్రం రైతులు వాటర్ ట్యాంక్ ఎక్కి హల్ చల్ చేసిన సంఘటన కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని బాబాసాగర్ గ్రామంలోగురువారం చోటుచేసు కుంది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. చింతలమానేపల్లి మండలం లోని బాబాసాగర్ గ్రామానికి చెందిని కేర్‌కర్ శ్యాంరావు, కేర్‌కర్ వెంకటేష్‌లకు తమ వంశ పారంపర్యంగా వచ్చిన బాబాసాగర్ శివారు లోని ఖాతానెం. 482లో 89/ 1/ 1/1లో 2 ఎకరాలు, ఖాతా నెం. 483 లో సర్వే నెం. 89/2/1లో2 ఎక రాల చొప్పున తన వంశ పార్యం పరంగావచ్చిన భూమి ఉండగా గత రెండు సంవత్సరాల క్రితం బాబా సాగర్ గ్రామ సమీపంలో అర్కగూడ ప్రాజెక్టు కాలువ నిర్మాణంలో బాగంగా ఇద్దరు అన్న దమ్ములకు సం బంధించి 2 ఎకరాల భూమి ముంపునకు గురికావడంతో మిగతా 2 ఎకరా ల్లో వ్యవసాయసాగు కోసం పనులు చేస్తుండగా రెవెన్యూ అధికారులు అడ్డుకుని ఈ భూమి ప్రభుత్వ ఆధీనంలో ఉందని తమకు ఎలాంటి హక్కు లు లేవని, పనులు వెంటనే నిలిపివేయాలని చెప్పడంతో బెంబే లెత్తిన రైతు లు వారితో వాగ్వాదానికి దిగారు.

తమకు భూమిలేనిదే పట్టా పాసు పుస్త కం, రైతు బంధు చెక్కులు ఎలా వస్తాయని ఈ భూమి మాదేనంటే కలెక్టర్, ఆర్డివో కార్యాలయాల్లో దరఖాస్తులు చేసుకున్నా మని, ఈ భూమిపై సర్వ హక్కులు నాకు ఉన్నాయని రెవెన్యూ అధి కారులకు విన్నవించినా తన సమస్యను పరిష్కరించడం లేదంటూ కేర్‌కర్ శ్యాంరావు తనయుడు కేర్‌కర్ లక్ష్మినారాయణ గురువారం ట్యాంక్ ఎక్కి ఆందోళన చేయడంతో సమాచారం తెలుసుకున్న ఎస్‌ఐ లచ్చన్న సంఘటనా స్థలానికి చేరుకుని ట్యాంకు దిగి వచ్చి తన సమస్యను అధికారులకు తెలియజే యాలని సమస్యను పరి ష్కరించేందుకు కృషిచేస్తానని హామీ ఇవ్వడంతో వెంటనే ఆందోళన విర మింప చేసి తమ సమస్యను ఎస్‌ఐకు విన్నవించ గా రెవెన్యూ అధికారులతో మాట్లాడి త్వరలోనే పరిష్కరించేందుకు కృషిచేస్తానని అన్నారు.

Farmer is Concerned to Solve Land Issue