Home రాజన్న సిరిసిల్ల రైతే ఆర్థిక వ్యవస్థకు మూలం

రైతే ఆర్థిక వ్యవస్థకు మూలం

ktr

మనతెలంగాణ/సిరిసిల్ల: రైతేగ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కేం ద్రమని పురపాలక,ఐటి శాఖల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. గురువారం సిరిసిల్లలో రైతు బంధు పథకం అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. స్వామినాథన్ కమిటీ సిఫారసుల మేరకు పనులు చేపట్టాలంటే ప్రభుత్వాలు గతంలో భయపడ్డాయని ప్రతిపక్షాలన్నీ స్వామినాథన్ కమీషన్ సిఫారసులను అమలు చేయాలని డిమాండ్ చేసేవన్నారు.నీరు,నిధులు,నియామకాల కోసం పోరాడి సాధించుకున్న తెలంగాణలో స్వయంగా రైతైన సిఎం కెసిఆర్ రైతుల కష్టాలు తెలుసుకుని రైతు కష్టాలు తీ ర్చడానికి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతులకు పం ట పెట్టుబడిని సాయంగా అందిస్తున్నారన్నారు. సకాలం లో ఎరువులు, విత్తనాలు రైతులకు అందించగలిగితే సగం కష్టాలు రైతులకు తీరినట్లేనన్నారు. నీరు, కరెంట్‌ను పారదర్శకంగా ఇబ్బంది లేకుండా అందించాలన్నారు. గోదావరి, కృష్ణా నదుల్లో తెలంగాణ రాష్ట్రం వాటా 1200 టిఎంసిలని వాటితో కోటి ఇరవై లక్షల ఎకరాల్లో పంటలు పండించవచ్చన్నారు. సిఎం కెసిఆర్ కాళేశ్వరం,పాలమూరు, మధ్యమానేరు,సీతారామ ప్రాజెక్టుల వంటివి నిర్మించి కోటి ఎకరాల మాగాణికి సాగునీరు అందించాలని, బీడు భూములన్నీ సస్యశ్యామలం చేయాలని చూస్తున్నారన్నారు. సిరిసిల్ల,వేములవాడ,మానకొండూరు,హుస్నాబాద్ వంటి దు ర్భిక్ష ప్రాంతాలను సైతం కళకళలాడేలా చేయాలన్నదే కెసిఆర్ లక్షమన్నారు.దేశంలో అందరికి ఆదర్శంగా ఉండేలా విత్తనాలు,కరెంట్,నీటి సరఫరా చేస్తున్నారన్నారు. ప్రతి గ్రా మీణ నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారన్నారు.అధికారంలోకి వచ్చిన ఆ రు నెలల్లోనే వ్యవసాయానికి 24గంటలు కరెంట్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు.గతంలో మాదిరిగా తె లంగాణలో కరెంట్ కష్టాలు లేవన్నారు. బ్యాంకుల సిబ్బందిని గతంలో రైతులు దయ్యాలు,భూతాల్లా చూసే వారిని ఇప్పుడు రైతు రుణ విముక్తి చేయడంతో పాటు భవిష్యత్తు లో రైతులకు రుణం అనే ఆలోచన రాకుండా ముందస్తుగా ప్రభుత్వపరంగా రైతుబంధు ద్వారా పెట్టుబడి అందిస్తున్నామన్నారు. ఓట్ల కోసమో,సీట్ల కోసమో రైతు బంధు పథకం, ఇతర పథకాలను అమలు చేయడం లేదన్నారు. ప్రతిపక్షా ల మాటలను ప్రజలు విశ్వసించడం లేదని అయినా తప్పు డు ప్రచారాలతో రైతులను,ప్రజలను మోసగించేందుకు వ స్తున్నారని ఆయన అన్నారు.17000 కోట్ల రూపాయల రు ణమాఫీ ఏకకాలంలో చేయడానికి సీఎం కెసిఆర్ ప్రయత్నించారని అయితే ఆర్బీఐ అంగీకరించకపోవడంతో నా లుగు కిస్తుల్లో రుణమాఫీ చేయాల్సి వచ్చిందన్నారు. ప్రతిపక్ష నేతలు ఒకేసారి రైతుల 2లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని ప్రకటించడం సూది కథలాగా ఉ ందని వివరించారు. రైతులను మభ్యపెట్టే ప్రకటనలు చేసేవారిపట్ల జా గ్రత్తగా ఉండాలన్నారు.రాజన్న సిరిసిల్ల జిల్లాలో 250 చెరువులను నింపి రైతులకు నీరందించాలని చూస్తున్నామన్నారు.కులవృత్తులను ప్రో త్సహించడమంటే వారిని చదువుకు దూరం చేయడం కాదన్నారు. వం దలాది గురుకులాలు ప్రారంభించి ఒక్కో విద్యార్థిపై 1.20 లక్షల రూపాయలను వ్యయం చేస్తున్నామన్నారు. గ్రామీణ, ఆర్థిక వ్యవస్థ బలోపేతం చేయడానికి రైతుల అభివృద్దికి చేస్తున్న కృషిని ప్రతిపక్షాలు హేళన చేస్తున్నాయన్నారు.గతంలో పాలకులుగా ఉన్నవారు చేయలేని పనులను సి ఎం కెసిఆర్ చేస్తుంటే తమకు అధికారం కలగా మారుతుందని భావించి వంకర టింకర కుల్లబొడిచే మాటలు,వెటకారపు మాటలు, వంకర మాటలు మాట్లాడుతున్నారన్నారు.సిరిసిల్ల నేతన్నలకు నూలు, రసాయనా లు 50శాతం సబ్సిడీపై అందిస్తున్నామన్నారు. బతుకమ్మ తదితర వస్త్రాల తయారీ ఆర్డర్లు ఇస్తున్నామన్నారు. సిరిసిల్ల లో గిరికతాళ్ల ద్వారా గౌడన్నలకు ఉపాధి పెంచుతున్నామన్నారు. గతం లో కాంగ్రెస్ పాలకులు మంచి చేస్తే తెరాసను అధికారంలోకి ప్రజలు ఎందుకు తెచ్చే వారని ఆయన అన్నారు. భూ రికార్డుల శుద్దీకరణ లో జి ల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. 172 రెవెన్యూ గ్రామాల్లో 95,638 పా సుబుక్కులు,1,05,074 మంది రైతులకు, 1,05,795 చెక్కులను అందిస్తున్నామన్నారు.జిల్లాలో 4168 మంది ఇప్పటికీ ఆధార్, ఫోటోలు అ ందించలేదని వెంటనే వాటిని అందించాలని సూచించారు. ప్రతి 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్‌ను ఏర్పాటు చేసి జిల్లాలో 53 క్లస్టర్లను నిర్ణయించామన్నారు. గ్రామీణ ప్రాంత రైతులు, వ్యవసాయ సంబంధ సాంకేతిక ప రిజ్ఞానం పెంచుకున్నారన్నారు. మహిళా సంఘాల మాదిరిగా రైతులు, రైతు సమన్వయ సమితుల ద్వారా మద్దతు ధరలను శాసించి సాధించుకోవాలన్నారు.క్లిష్ట పరిస్థితుల్లో మద్దతు ధర చెల్లించడానికి రాష్ట్ర ప్రభు త్వం బడ్జెట్‌లో 500కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. రైతు బంధు పథకం అమలులో లోటు పాట్లు ఉంటే తక్షణమే సరిచేస్తారన్నారు. ఎవరూ ఇబ్బంది పడవద్దని సూచించారు. వ్యవసాయం పండుగలా సా గాలని ఊరూరా ఉగాది, దసరాల రైతు బంధు చెక్కుల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు ర సమయి బాలకిషన్ మాట్లాడుతూ రైతు కేంద్రంగా గ్రామాలు ఏర్పాటయ్యాయన్నారు.రైతు సంతోషంగా ఉంటేనే రాజ్యం సంతోషంగా ఉం టుందన్నారు. గతంలో పంటలు పండకముందే పంటలు కుదువబెట్టుకునే దుస్థితి ఉండేదని శ్రీరాముడు, అశోకుడు, కాకతీయులు, నైజాం రాజుల కాలంలో కూడా పండిన పంటలకు భూమి శిస్తు వసూలయ్యేదని కెసిఆర్ పాలనలో మాత్రం భూమి శిస్తు లేకుండా పట్టాదారు పాసుపుస్తకంతో పాటు 8వేల రూపాయలు ఎదురు అందిస్తున్నారని ఇది ప్ర పంచ చరిత్రలో అరుదైన రికార్డు అన్నారు. రైతులు ఈ విషయమై గ్రా మాన్ని చర్చలు జరపాలని కాంగ్రెస్ ప్రతిపక్ష నేతలను గ్రామాల్లో కాలు పెట్టకుండా నిలదీయాలని సూచించారు.కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించకు ండా కేసులను వేసినా కాంగ్రెస్ నేతలను అడ్డుకోవాలన్నారు. ఎంఎల్‌ఎ చెన్నమనేని రమేశ్రావు మాట్లాడుతూ రైతు బంధు పథకం చారిత్రాత్మకమైనదన్నారు. రైతులు అప్పులపాలు కాకుండా ఆదుకుంటుందన్నారు. ఇలాంటి పథకందేశంలోనే మొదటిదన్నారు.గుణాత్మకమైన పాలన సాగిస్తున్నారని కెసిఆర్‌కు కితాబిచ్చారు.24 గంటల విద్యుత్, బడ్జెట్‌లో రైతుల కోసం ఏటా 25000 కోట్ల రూపాయల కేటాయింపు రైతుకు రూ.5లక్షలబీమా, సంక్షోభంలో ఉన్న వ్యవసాయాన్ని సంక్షేమం దిశగా నడిపించిన ఘనత కెసిఆర్‌దేనన్నారు.గతంలో బ్రతుకుదెరువు కోసం వ్యవసాయం చేసేవారని ఇప్పుడు లాభాల కో సం వ్యవసాయం చేస్తున్నారని ఆయన అన్నా రు. టెస్కాబ్ చైర్మన్ కొండూరి రవీందర్‌రావు మాట్లాడుతూ సిరిసిల్ల జిల్లాలో రైతుబంధు ప థకం కింద 97 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నారన్నారు. రైతు సంక్షేమం కోసం సిఎం కెసిఆర్ అనేక సంక్షేమ పథకాలు చేస్తున్నారన్నారు.జిల్లా వ్య వసాయాధికారి ఆర్ అనిల్‌కుమార్ రైతు బం ధు పథకం గూర్చి వివరించారు. జాయింట్ కలెక్టర్ యాస్మిన్‌భాషా పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ గూర్చి తెలియజేశారు. ఈ కా ర్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి అ ధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్ చైర్మన్ డి ల కా్ష్మరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ సామల పా వని, డిఆర్‌ఒ శ్యాంప్రసాద్‌లాల్, ఆర్డీవో పాం డురంగ, ఏఎంసి చైర్మన్ జిందం చక్రపాణితోపాటు జడ్‌పిటిసిలు, ఎంపిపిలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.