Home రంగారెడ్డి అన్నదాత గుండెకోత

అన్నదాత గుండెకోత

కనిష్ట స్థాయికి పడిపోయిన కందుల ధరలు
మద్దతు ధర పెంచని ప్రభుత్వ రంగ సంస్థలు
విక్రయానికి నిరాకరిస్తున్న రైతులు
మార్కెట్ కమిటీకి తగ్గనున్న ఆదాయం

Farmer

మన తెలంగాణ/తాండూరు :  ఆరుగాళం కష్టపడి పంటలు పండించిన అన్నదాతకు గుండెకోత మిగులుతుంది. వంటలు పండక అల్లాడుతున్న అన్నదాతకు మద్దతు ధరలు లేక పోవడంతో ఆత్మహత్యలే శరణ్యం అవుతున్నాయి.గత సంవత్సరం వర్షాలు లేని కారణంగా పంటలు పండక అల్లాడుతున్న రైతులకు ఈ సంవత్సరం వర్షాలు కురవడంతో కాస్తా పంటలు చేతికందాయి.ఆశించిన స్థాయిలో పంటలు పండటంతో రైతులు హార్షం వ్యక్తం చేశారు. అయితె పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.తాండూరు డివిజన్‌లోని పెద్దేముల్,యాలాల, బషీరాబాద్, తాండూరు మండలాలలోని రైతులు ప్రధానంగా కంది పంటను పండిస్తారు.అయితె మార్కెట్‌లో కందులకు ధర లేకపోవడంతో రైతులు దిగులు చెందుతున్నారు,గత సంవత్సరం డిశంబర్ నెలలో కందులు క్వింటాళుకు రూ.12 వేల వరకు ధర పలికింది.అయితె ప్రస్తుతం మార్కెట్‌లో కందుల ధరలు ఒక్కసారిగా పథనమైయ్యాయి.

సీజన్ ప్రారంభం నుండి నేటి వరకు కందులు క్వింటాళుకు రూ.5వేలకు మించి ధర పలకడం లేదు.దీంతో రైతులు నిరాశ చెందుతున్నారు.మరో పక్క ప్రభుత్వ రంగ సంస్థలైన మార్క్‌ఫెడ్,నాఫెడ్ గత సంవత్సరం కందులను కొనుగోళు చేసింది.ఈ సంవత్సరం కేవలం మార్క్‌ఫెడ్ మాత్రమే కందులను కొనుగోళు చేస్తుంది.అయితే ప్రభుత్వం కందులు క్వింటాళ్‌కు రూ.5050 మద్దతు ధర నిర్ణయించడంతో రైతులు గత సంవత్సరంతో పోల్చితే సగం ధర కూడా పలకడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. మార్కెట్‌లో రైతులు ఆందోళనలు చేస్తున్నారు.తాండూరు డివిజన్‌లో సుమారు 25 వేల హెక్టార్లలో కంది పంటను రైతులు సాగుచేశారు.తాండూరు కందులకు దేశ విదేశాలలో మంచి గుర్తింపు ఉంది.కాని కంది రైతుకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నాడు. ప్రభుత్వం మద్దతు ధర పెంచాలని ఆందోళన చేస్తున్న ప్రభుత్వం  పట్టించుకోవడం లేదు.దీంతో రైతులు పండించిన కందులను మార్కెట్‌కు తరలించడం లేదు.విక్రయానికి రైతులు నిరాకరిస్తున్నారు.కందుల విక్రయాలు లేక పోవంతో మార్కెట్ కమిటికి రావాల్సిన ఫీజు సైతం తగ్గి పోయింది.కందుల విక్రయానికి ఆన్‌లైన పద్దతి పెట్టిన కందులకు మద్దకు ధర లభించడం లేదు.దీంతో తాండూరు మార్కెట్‌లో కందుల నిల్వలు పేరుకు పోయాయి.ప్రభుత్వం కందులు క్వింటాళ్‌కు రూ.7వేల మద్దతు ధర కల్పించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.