Wednesday, April 24, 2024

రైతుని కాపాడటం మా కర్తవ్యం: కేశవరావు

- Advertisement -
- Advertisement -

Farmer save from agriculture bill by K Keshava rao

ఢిల్లీ: వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా మొదటి సారి ప్రతిపక్షాల అన్ని కలిసి మార్చ్ నిర్వహించాయని ఎంపి కె కేశవరావు తెలిపారు. వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసన కొనసాగుతోంది. గాంధీ విగ్రహం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు విపక్షాలు మార్చ్ నిర్వహించాయి. ఈ సందర్భంగా కెకె మాట్లాడారు. గాంధీ స్ఫూర్తితోనే ఈ ర్యాలీ నిర్వహించామని, గాంధీజీ కూడా భూమి కర్షకునిదే అన్నారని గుర్తు చేశారు. అలాంటి భూమిని కార్పొరేట్ సెక్టార్‌కు మోడీ ప్రభుత్వం అప్పగించి రైతును అణుగదొక్కుతుందని కెకె మండిపడ్డారు. రైతుని కాపాడటం మా కర్తవ్యమని, వ్యవసాయ బిల్లులను తప్పుడు పద్దతిలో పాస్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజసభలో ఎనిమిది మంది సభ్యులను రూల్స్ విరుద్ధంగా సస్పెండ్ చేశారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News