Home రంగారెడ్డి కేంద్రానికి రైతు గోస

కేంద్రానికి రైతు గోస

ఎండిన చెరు వులు… బీడువారిన పొలాలు
80 శాతం పంటపొలాలు ఎండిపోయాయి
అన్నదాతల కష్టాలు అడిగి తెలుసుకున్న కేంద్ర కరువు బృందం
కేంద్రానికి నివేదిస్తాం: బృందం సభ్యులు ఉత్పల్ కుమార్ సింగ్
భూగర్భ జలాలు 1000 ఫీట్ల వరకు పడిపోయాయి: ఎజెడి జగదీష్

తక్షణ సహాయం అందేలా కేంద్రానికి నివేదిక: ఉత్పల్‌కుమార్‌సింగ్
KARUVUవికారాబాద్ : రాష్ట్రంలో నెలకొన్న కరువుకు కేంద్ర ప్రభుత్వం తక్షణం సహా యం అందేలా నివేదిక అందజేస్తామని కేంద్ర కరువు బృందం అధికారి, కేంద్ర వ్యవసాయ శాఖ జాయింట్ కార్యదర్శి ఉత్పల్‌కుమార్‌సింగ్ అన్నారు.
మంగళ వారం కేంద్ర బృందం సభ్యుడు పొన్నుస్వామితో కలిసి వికారాబాద్ పట్టణంలోని శివసాగర్ చెర్వును పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్పల్‌కుమార్‌సింగ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కరువు ప్రభావిత ప్రాంతాలలో పలు బృందాలు పర్యటిస్తున్నాయని, ఆ బృందాలు కరువుతో ఎంత నష్టం వాటిల్లిందో పరిశీలించి నివేదికలు తయారు చేస్తాయని తెలిపారు. కరువు ప్రభావం ఉన్న ప్రజలతో మాట్లాడినట్లు చెప్పారు. మంచినీటి ఎద్దడి ఉన్న విష యం తమ దృష్టికి వచ్చిందని, అన్ని కోణాలలో పరిశీలించి నివేదికలు తయారు చేస్తామమన్నారు. నకిలీ విత్తనాలు విషయం కూడా తమ దృష్టికి వచ్చిందని, రాష్ట్ర ముఖ్యమంత్రితో కలిసి కూడా పలు విషయాలను ఆయన దృష్టికి తీసుకు వెళ్తామని తెలిపారు. రైతులకు కరువు నష్ట పరిహారం దశల వారీగా కాకుండా ఒకేసారి అందేవిధంగా నివేదిక రూపొందించి ప్రభుత్వానికి అందజేస్తామని వివరించారు. శివసాగర్ చెరువు గురించి పబ్లిక్ హెల్త్ ఇఇ శేషగిరిరావును అడిగి తెలుసుకున్నారు. శివసాగర్ చెరువులో నీరు అడుగంటిపోవడంతో నీటి సరఫరా చేపడుతున్నారని అడుగగా, బోర్‌బావులు, వాటర్ ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నట్లు వివరించారు. మున్సిపల్ పరిధిలో 8 గిరిజన తండాలు ఉన్నాయని, వాటికి వాటర్‌ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నామని మున్సిపల్ చైర్‌పర్సన్ వి.సత్యనారాయణ కేంద్ర బృందం అధికారులతో చెప్పారు. నీటి సరఫరాకు ట్యాంకర్లు సరిపోవడం లేదని తెలిపారు. ఈ కార్యక్ర మంలో జాయింట్ కలెక్టర్ రంజిత్‌కుమార్‌షైనీ, వ్యవసాయశాఖ రాష్ట్ర కమి షనర్ ప్రిదర్శిణి, జిల్లా జాయింట్ డైరెక్టర్ జగదీష్, వికారాబాద్ సబ్ కలెక్టర్ వర్షిణి, ఇరిగేషన్ ఇఇ వెంకటేశం, మున్సిపల్ కమిషనర్ జైత్రాంనాయక్, డిప్యూటీ ఇఇ గోపాల్, మండల తహసీల్దార్ గౌతంకుమార్, వ్యవసాయశాఖ ఎడిఎ దివ్యజ్యోతి, ఎఒ వినయ్‌కుమార్, పశు వైద్యాధికారి డాక్టర్ యామిని, సిఐ రవి తదితరులు పాల్గొన్నారు.
పట్నంలో కేంద్ర కరువు బృందానికి మొరపెట్టుకున్న రైతులు…
ఇబ్రహీంపట్నం టౌన్: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువును కేంద్ర బృందం సభ్యులు, కేంద్ర జాయింట్ డైరెక్టర్ ఉత్పల్‌కుమార్ సింగ్, ఆయిల్ కార్పొరేషన్ డైరెక్టర్ పొన్ను స్వామి, తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ప్రియ దర్శినితో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ రజిత్‌కుమార్ షైనీ , స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిలు మంగళవారం పరిశీలించారు. ఈ సందర్బంగా కేంద్ర బృందంకు జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ జగదీష్, పశుసంవర్థక శాఖ జెడి వరప్రసాద్‌రెడ్డి, ఆర్‌డబ్లూఎస్ ఎస్‌ఇ శ్రీనివాస్‌రెడ్డి , డ్వామా పిడి విజయ్‌గోపాల్, ఆర్డీఒ సుదాకర్‌రావులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ప్రాంతం తీవ్ర దుర్బిక్ష పరిస్థితులపై కేంద్ర బృందంకు వివరించారు. ముఖ్యంగా వ్యవసాయ శాఖ జెడి జగదీష్ మాట్లాడుతూ జిల్లాలో 1.95 లక్షలు హెక్టార్లలో తీవ్ర కరువు ఏర్పడిందని వర్షాలు లేక 80 శాతం పంటపొలాలు ఎండిపోయాయని ఈ సంవత్సరం రబీలో 33 మండలాలలో 55 వేల ఎకరాలు సాగు చేసారని మొత్తం నీరు లేక వేసిన పంటలు పూర్తిగా ఎండిపోయాయని వివరించారు. జిల్లాలో ఎక్కడ చూసినా గ్రౌండ్ వాటర్ 600 ఫీట్లనుండి 1000 ఫీట్ల వరకు పడిపోయాయని మొరపెట్టుకున్నారు. ముఖ్యంగా యాచారం, ఇబ్రహీంపట్నం, మంచాల, శేరిలింగంపల్లి, బంట్వారం, పరిగి, దోమ, మండ లాలలో గ్రౌండ్ వాటర్ తీవ్రంగా పడిపోయిందని, కనీసం తాగునీరు లేకా దుర్భర పరిసిత్థిలో కొట్టుమిట్టాడుతున్నాయని అన్నారు. మొత్తం జిల్లాలోని 492 పంచాయతీలో ఉపాధి హామీ పథకం నుండి 45వేల 286 మంది కూలీలు కరువు పనులు చేస్తున్నారని వివరించారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా సుమారు ౩ లక్షల మందికి జాబ్ కార్డులు అందజేసినట్లు తెలిపారు. గత సంవత్సరం చివరలో 100రోజులు పూర్తి చేసుకున్న వారు 13286 మంది కూలీలు ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిపి మర్రి నిరంజన్‌రెడ్డి, ఆర్‌డిఓ సుధాకర్‌రావు, హయత్‌నగర్ జడ్పిటిసి తావుల నర్సింహ, నగరపంచాయతీ చైర్మన్ భరత్‌కుమార్, వైస్ చైర్మన్ సుల్తాన్, కమి షనర్ ప్రవీణ్‌కుమార్, తహసీల్దార్ విజయేందర్‌రెడ్డి, ఎఓ వరప్రసాద్‌రెడ్డి, ఎఇఓ శ్రావణ్‌కుమార్, కౌన్సిలర్లు ఆకుల యాదగిరి, టేకుల రాంరెడ్డి, నీలం శ్వేత, మత్సకార్మిక సొసైటీ అధ్యక్షులు నాస మహాదేవ్, తెరాస జిల్లా రైతువిభాగం అధ్యక్షులు మొద్దు అంజిరెడ్డి, బిజెపి నాయకులు దొండ రమణారెడ్డి, జక్క రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు.
రైతాంగాన్ని ఆదుకోవాలి: ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి
గత పది సంవత్సరాల నుండి ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తీవ్ర కరువు కోరల్లో చిక్కు కుందని వెంటనే రైతాంగాన్ని ఆదుకొని తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలని కేంద్ర బృందంకు విన్నవించారు. ఈ మేరకు కేంద్ర బృందంకు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లా డుతూ నీరు లేక అనేక మూగ జీవాలను అమ్ముకుంటున్నారని, వాటికి గడ్డి సరఫరా చేయాలని డిమాండ్ చేసారు. తక్షణమే కేంద్ర ప్రభుత్వం కరువు సహా యక చర్యలు తీసుకొని ఎక్కువ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేసారు. ముఖ్యంగా గొర్రెల,మేకలకు నీటి తొట్లు కట్టించాలని సూచించారు. ఉపాధి హామీ పథకంను రైతులకు అనుసంధానం చేయాలని సూచించారు. చారిత్రాత్మక నేపథ్యం కలిగిన ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు పూర్తిగా ఎండి పోవడంతో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. చెరువును నిం పేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, ఇందుకు కేంద్ర ప్రభుత్వం సహాయాన్ని అందివ్వాలని కోరారు. కరువులో పంట నష్టం కోల్పో యిన రైతాంగాన్ని ఆదుకొని వారికి అండగా ఉండాలని తెలిపారు. రైతులకు 90 శాతం సబ్సిడీలు అందజేయాలని కోరడం జరిగిందని చెప్పారు.
కరువు సహాయక చర్యలు చేపట్టాలి : మొద్దు అంజిరెడ్డి
తక్షణమే ఇబ్రహీంపట్నం నియోజకవర్గాన్ని కరువు ప్రాంతంగా ప్రక టించి సహాయక చర్యలు చేపట్టాలని తెలంగాణా రైతు విభాగం జిల్లా అధ్య క్షులు మొద్దు అంజిరెడ్డి అన్నారు. ఈ మేరకు కేంద్ర బృందంకు వినతి పత్రం అందజేసారు. ఈసందర్బంగా ఆయనతో పాటు రైతులు క్రిష్ణారెడ్డి , నర్సింహ్మా రెడ్డిలు మాట్లాడుతూ భూగర్బ జలాలు పూర్తి గా పడిపోయాయని, ఎక్కడ బోర్లు వేసినా ఫలితం లేదని వాపోయారు. ముఖ్యంగా 6 నుండి 1వెయ్యి ఫీట్ల వరకు బోరు వేసినా చుక్క నీరు రావడం లేదని వివరించారు. రైతులకు 90 శాతం సబ్సిడీలు అందజేసేవిధంగా కృషి చేయాలని డిమాండ్ చేసారు.
చేవెళ్ల మండలంలో …
చేవెళ్ల: చేవెళ్ల మండల కేంద్రంలోని చేవెళ్ల అనుబంధ గ్రామం కేసారంలో మం గళవారం కేంద్ర కరువు బృందం పర్యటించింది. గ్రామ పరిధిలోని రియా ఎం బీఏ కళాశాల పక్కనేగల పత్తి పంటలను కేంద్ర బృందం పరిశీలించారు. కేంద్ర బృందం అక్కడి రైతులతో నేరుగా ముఖాముఖిగా మట్లాడారు. కేంద్ర కరువు బృందంలోని జాతీయ ప్రభుత్వ జాయింట్ సెక్రటరి ఉత్పల్ కుమార్‌సింగ్, డైరె క్టర్ ఆఫ్ ఆయిల్ సీడ్స్ పొన్నుస్వామి, రాష్ట్ర వ్యవసాయ శాఖ కమిషనర్ ప్రియ దర్శిణిలు పాల్గొన్నారు. చేవెళ్ల వ్యవసాయశాఖ ఏడీఏ దేవ్‌కుమార్ మాట్లా డుతూ చేవెళ్ల మండలంలో మొత్తం 27వేల 576 హెక్టార్ల పొలం ఉందన్నారు. అందులో 24వేల 577 హెక్టార్లలో రైతులు పంటలను సాగు చేశారని కేంద్ర బృందానికి చెప్పారు. 9 వేల 683 హెక్టారలో పత్తి పంటలను సాగు చేశారని వివరించారు. చేవెళ్ల ఎంపిపి మంగలి బాల్‌రాజ్ మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా వర్షాలు పడక రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గ్రామాల్లో తాగునీటికి కూడా సమస్య ప్రారంభమైందని కేంద్ర బృందానికి సూచించారు. పశువులకు గ్రాసం కూడా లభించడంలేదని వాపోయారు. పండిన కొద్ది పాటి పంటలను కూడా మార్కెట్‌కు తరలిస్తే గిట్టుబాటు ధర కూడా లభ్యం కావడం లేదని పేర్కొన్నారు. గతంలో ఎకరాకు 10 నుంచి 12 క్వింటాళ్ల పత్తి దిగుబడి వచ్చేదని ఇప్పుడు వర్షాల్లేమి కారణంగా ఎకరాకు 2 క్వింటాళ్లు కూడా రావ డంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పంట పొలాల్లోని బోర్లు ఇప్పటికే ఎండి పోయాయని తెలిపారు. గతంలో 300 ఫీట్లు లోతు బోరును తవ్వుకుంటే నీరు వచ్చేదని ఇప్పుడు వేయి ఫీట్లు తవ్వినా నీరు రావడంలేదన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలన్నారు. ఈ మండలంలో అత్యధికంగా రైతులు పంటలపైనే ఆధారపడి ఉన్నారన్నారు. వర్షాలు పడకపోతే తాము జీవనం సాగించేది కష్టతరంగా ఉందన్నారు. కేసారం గ్రామంలో జాతీయ ఉపాధి హామి పథకం ద్వారా ఏం పనులు జరుగుతున్నాయని కేంద్ర బృందం ప్రశ్నించగా.. ఏపిఓ ఉషా మాట్లాడుతూ ఎన్‌ఆర్‌ఈజిఎస్ కింద కేసారం గ్రామంలో ఎలాంటి పనులు సాగడంలేదన్నారు. ఎన్‌ఆర్‌ఈజిఎస్ కింద గ్రామంలో పనులు ప్రారంభిస్తాం చేసుకుంటారా అని కేంద్ర కరువు బృందం సభ్యులు రైతులను అడగ్గానే రైతులంతా ముక్తకంఠంతో పనులను చేసుకుంటా మని అధికారులకు జవాబిచ్చారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన పలు రకాల పంటల ఫోటో ప్రదర్శనను వారు తిలకించారు. పంటల పొలాలను పర్యవేక్షణ చేసిన కేంద్ర కరువు బృందం సభ్యులు అక్కడి నుంచి జిల్లాలోని ఇతర ప్రాంతాలను పరిశీలించేందుకు తరలివెళ్లారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్ షైని, జేడిఏ జగదీష్, పిడి వరప్రసాద్‌రెడ్డి, చేవెళ్ల ఆర్డీఓ కె. చంద్రమోహన్, వ్యవసాయశాఖ అధికారులు ఎస్. వి. భారతి, రాగమ్మ, తహసీల్థార్ వెంకట్‌రెడ్డి, ఎంపిడిఓ రత్నమ్మ, పశువైద్యాధికారులు మధుసుదన్, శిరీష, విజయభారతి, రాఘవేందర్, రైతులు పాల్గొన్నారు.
రంగాపూర్‌ను సందర్శించిన కేంద్ర బృందం …
పరిగి: జిల్లాలో వర్షాభావ కారణాల వల్ల నెల కొన్న కరువును పరిశీలించేందుకు మంగళవారం పరిగి మండల పరిధిలోని రంగాపూర్ గ్రామానికి కేంద్ర బృందం చేరుకుని నష్టపోయిన పంటలను పరిశీలించింది. ఈ సందర్బంగా కేంద్ర పర్యాటక లీడర్ యుకే సింగ్ మాట్లాడుతూ జిల్లాలో వర్షాభావ కారణాల వల్ల కరువు ఏర్పడడంతో నష్టపోయిన పంటలను పర్యాటక బృందం పరిశీలించడం జరుగు తుందన్నారు.రైతులు ఏవిధంగా నష్టపోయారు అని రైతులను అడిగి తెలుసుకు న్నారు. రైతులు ఎందుకు ఆత్మహత్యలకు పాలుపడుతున్నారని గ్రామస్తులను అడి గారు. రంగాపూర్‌లో పత్తి, శనగా తదితర పంటలను పరిశీలించారు. కార్యక్ర మంలో కేంద్ర పర్యాటక ప్రధాన కార్యదర్శి పూనుస్వామి, డైరేక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ డైరెక్టర్ రాజ్‌నాథ్ సినీ ,జేసి 1 మరియు అన్ని రంగాల అధికారులు పాల్గొన్నారు.