Home తాజా వార్తలు కలెక్టర్ కార్యాలయంలో రైతు ఆత్మాహత్యాయత్నం…

కలెక్టర్ కార్యాలయంలో రైతు ఆత్మాహత్యాయత్నం…

 

పాస్‌బుక్‌లో భూ వివరాల తప్పులే కారణం
 అడ్డుకున్న అధికారులు.. ఆస్పత్రికి తరలింపు
 బాధితుడిని పరామర్శించిన కలెక్టర్
 సమస్యలు పరిష్కరిస్తామని హామీ

నారాయణపేట : నారాయణ పేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో ఓ రైతు ఆత్మ హత్యాయత్నానికి పాల్పడిన అనూహ్య సంఘటన శనివార ం మధ్యాహ్నం చోటు చేసుకుంది. దీనికికారణం తన పట్టా పాస్‌బుక్‌లో భూ వివరాల త ప్పులే కారణమని బాధిత రైతు వెల్లడించారు. నా రాయణపేట జిల్లా దామరగిద్ద మండలంలోని చాకల్‌పల్లి గ్రామానికి చెందిన రైతు నర్సిములు కు సర్వే నెంబర్ 92/అఆ/2 భూమిలో 2 ఎకరా ల 24 గుంటల విస్తీర్ణం భూమి తన తాతల కా లం నుంచి పట్టాగా తన పేరుపై చేరింది. ఈ మ ద్యనే జరిగిన భూ సమగ్ర సర్వే తర్వాత ప్రభు త్వం కొత్త పాస్‌బుక్‌లను అందించగా అందులో 2.24 ఎకరాలకు గాను కేవలం ఒక గుంట మా త్రమే భూమి ఉన్నట్లు ప్రింట్‌తో పాస్‌బుక్ జారీ అయ్యింది.

గత ఆరు నెలల నుంచి తన భూ వివరాలను సరిచెయ్యాలంటూ తన పాత పాస్‌బుక్ తో పాటు పట్టాకు సంబంధించిన ధృవపత్రాలను తమ గ్రామ విఆర్‌వోతో పాటు మండల అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాలేదు. దీంతో ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు అన్ని కూడా అందడం లేదనే మనస్థాపంతో శనివారం మధ్యాహ్నం తన భార్యతో కలి సి వచ్చిన రైతు నర్సిములు కలెక్టరేట్ ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. అది గమనించిన అక్కడ ఉన్న అధికారులు వెంటనే అడ్డుకొని పోలీసులకు స మాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకొని రైతును చికిత్స నిమిత్తం జి ల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న దామరగిద్ద మండల రెవెన్యూ అధికారితో పాటు జిల్లా కలెక్టర్ వెం కట్రావు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకొని రైతు తో నేరుగా మాట్లాడారు. వెంటనే సమస్యను పరిష్కరిస్తానని కలెక్టర్ హామి ఇచ్చినట్లు బాధి త రైతు భార్య పేర్కొన్నారు.

చిన్న తప్పులను సవరిస్తాం… కలెక్టర్ వెంకట్రావు
కొత్త పాస్‌బుక్కులు ఇచ్చే క్రమంలో కొన్ని గ్రామాలలో భూ సర్వే వివరాలు పాస్‌బుక్‌లో తప్పుగా నమోదయ్యాయని తిరిగి ప్రతి గ్రామంలో ఇప్పుడు భూ సర్వే చేస్తున్నామని దానికి రైతులు సహకరించాలన్నారు. చిన్న తప్పులకు రైతులు మనస్థాపం చెందరాదని అధికారులు సమస్యలు పరిష్కరిస్తారన్నారు. ఆత్మహత్యాయత్నం చేసిన రైతు సమస్యను తానే స్వయంగా పరిష్కరిస్తానని కలెక్టర్ తెలిపారు.

 

Farmer suicide attempt in the collector’s office