Home తాజా వార్తలు అన్నదాత ఆత్మహత్య

అన్నదాత ఆత్మహత్య

FARMERమహబూబ్‌నగర్ : అప్పుల బాధతో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటిక్యాల మండలం షాబాద గ్రామంలో భాస్కర్‌రెడ్డి అనే రైతు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు గ్రామస్థులు తెలిపారు. అప్పు చేసి తనకు ఉన్న చేనులో పత్తి సాగు చేశాడు. వర్షాభావ పరిస్థితులతో పత్తి ఎండిపోయింది. దీంతో అప్పులుతీర్చే మార్గం కనిపించకపోవడంతో భాస్కర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామ ప్రజలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.