- Advertisement -
మన తెలంగాణ /నార్నూర్‌ః కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని మహగావ్ గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై కృష్ణకుమార్ తెలిపిన వివరాల ప్రకారం రాథోడ్ మురారి(50) అదే గ్రామంలో 7 ఎకరాలు కౌలుకు తీసుకొని పత్తి పంట సాగు చేసుకుంటున్నాడు. ఈ ఏడాది ఆశించిన స్థాయిలో పంట పండక పోవడంతో తెచ్చిన అప్పులు ఎలా తీర్చాలనే దిగులుతో కుటుంబ పోషణ భారంగా మారి, ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. కాగా మృతునికి భార్య, ఆరుగురు ఆడ పిల్లలున్నారు. సంఘటన స్థలానికి వెళ్ళి శవ పంచనామా నిర్వహించి పోష్టుమార్టం నిమిత్తం ఉట్నూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. భార్య లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
- Advertisement -