Home తాజా వార్తలు మద్దతు ధర కోసం రైతుల ధర్నా

మద్దతు ధర కోసం రైతుల ధర్నా

Farmers Anxiety

 

జాతీయ రహదారులపై ఆందోళన
నేడు మామిడిపల్లి చౌరస్తాలో రాస్తారోకో
దళారీ వ్యవస్థ రద్దుకోసం డిమాండ్
పోలీసుల ముందస్తు భద్రతా చర్యలు
భారీగా చేరుకున్న పోలీసులు

మనతెలంగాణ/ఆర్మూర్: ఆర్మూర్ ప్రాంత రైతులు మరోమారు ఆందోళన బాట పట్టనున్నారు. మద్దతు ధర కోసం నానా రీతులుగా ఉద్యమం కొనసాగించారు. గత నెల రోజులుగా ఆర్మూర్,బాల్కొండ, నిజా మాబాద్ రూరల్ నియోజకవర్గాల్లో పసుపు, ఎర్రజొన్న రైతులు రాస్తారోకో, వంట వార్పు, ధర్నా వంటి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్‌ను కలిసి వినతి పత్రాలు అందజేశారు. కాగా తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధర రాకపోవడం కేవలం మధ్య దళారులేనని రైతులు ఆరోపిస్తున్నారు. పసుపు పంట క్వింటా లుకు 15వేల రూపాయలు, ఎర్రజొన్నలకు రూ.3,500గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నెల 25వ తేదిన ఆర్మూర్ మండలం మామిడిపల్లి చౌరస్తా వద్ద 63,44 జాతీయ రహదారుల కూడలిలో తమ నిరసనను వ్యక్తం చేయాలని నిర్మయించారు. గ్రామ గ్రామాల నుంచి రైతులు, మహిళలు అధిక సంఖ్యలో రావాలని తీర్మానించారు. మూడు నియోజకవర్గాల నుంచి వందకు పైగా గ్రామాల రైతులు ఈ ఆందోళనలో పాల్గొననున్నారు. అయితే ప్రతి గ్రామం నుండి ట్రాక్టర్ల ద్వారా మహిళలు, రైతులను ఆందోళన స్థ లానికి చేర్చడానికి ప్రణాళిక తయారు చేశారు.

దీంతో రోడ్ల పై వా హనాలను ఎక్కడికక్కడే నిలిపేందుకు దోహదపడతాయని ఆ లో చిస్తున్నారు. గత నెల రోజులుగా పసుపు, ఎర్రజొన్న రైతులు ఆందోళనకు దిగిన విషయం విధితమే. కాగా ఎలాంటి అవాంఛనీయ ఘ టనలకు చోటు లేకుండా రైతులు తగు జాగ్రత్తగా వ్యవహరించారు. ఈ విషయంలో పోలీసులు సైతం చాకచక్యంగా వ్యవహరించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిపి కార్తికేయ ఆ ధ్వర్యంలో ఆర్మూర్ ఎసిపి రాముఉ గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. రోజురోజుకు ఎర్రజొన్న, పసుపు రైతుల ఆందోళనలు అధిక మ వుతున్నాయి. ప్రభుత్వమే రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికి మద్దతు ధర పొందే వరకు ఆందోళన విరమించేది లేదని రైతులు స్పష్టం చేస్తున్నారు. ఈ సారి జరిగే ఆందోళనలో రైతుల నుండి అధికారులకు గానీ, ప్ర జా ప్ర తినిధులకు గానీ గట్టి ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం కూడా ఉంది.

Farmers Anxiety on National Roads For Support price