Home వరంగల్ వానాకాలం.. కరెంట్‌తో జరభద్రం

వానాకాలం.. కరెంట్‌తో జరభద్రం

FArmers Be Careful With Current In Rain Season

మన తెలంగాణ/మహాముత్తారం : నీరు విద్యుత్తును పుట్టిస్తుంది. అదే నీరు శత్రువుగా మారి ప్రాణాలు తీస్తుంది. వానాకాలంలో అంతటా తడిగా మారుతుంది. చిత్తడి తీగలు, స్విచ్‌లు, విద్యుత్ మోటార్లు ఇతరత్రా ఉపకరణాలు వాడేవారు జాగ్రత్తలు పాటించా లి. విద్యుత్ పరికరాలను జాగ్రత్తగా వినియోగించుకోవాలి. విద్యుదాఘాతం, షాట్ సర్కూట్‌ను నివారించాలి. మన్నికైన ఎలక్ట్రికల్ వస్తువులను వాడితే వానాకాలంలో సంభవించే పలు ప్రమాదాలను నివారించవచ్చు. ఈ సీజన్‌లో చిన్నపాటి జాగ్రత్తలు పాటించకపోతే ప్రమాదాలు మరింత ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. వానాకాలంలో ప్రధానంగా విద్యుత్ వైర్లు, కనెక్షన్లు ఉన్న చోట కొద్దిగా పదును ఉంటే చాలు విద్యుత్ షాక్ తగులుతు ంది. ఇలాంటి వాటన్నింటిని సరి చేసుకోవాలి. ప్రధానంగా ఇళ్ల లో స్విచ్ బోర్టులున్న చోట, బయట ఉండే విద్యుత్ బల్బులు తడుస్తున్న వాటి ద్వారా కూడా ఆ ప్రాంతాలకు విద్యుత్ సరఫరా అవుతుంది. ఇలా ఒక్కొక్కరి ఇళ్లలో గోడలకు కూడా ఎర్త్ వస్తుంది. ఇ లాంటి వాటిని నిర్లక్షం చేయకుండా వెంటనే మరమ్మతులు చే యించాలి. ఇళ్లలో బట్టలు ఆరేసేందుకు ఇనుప వైర్లను కట్టడం వల్ల అవి ఎక్కడ కరెంట్ ఉన్న చోట విద్యుత్ తీగలకు తగిలినా, విద్యుత్ తీగల తడి ఈ తీగలకు తగిలినా కరెంట్ సరఫరా అవుతు ంది. ఈదురు గాలులకు విద్యుత్ వైర్లు తెగిపడి పోవడం సర్వసాధారణం. వ్యవసాయ బోర్ల వద్ద రైతులు మోటార్ స్విచ్ వేసేటప్పు డు జాగ్రత్తలు పాటించాలి. గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయిందంటే ఫ్యూజ్ వేసేందుకు ప్రయత్నిస్తారు. అలాంటి చర్యలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కొద్దిపాటి జాగ్రత్త లు తీసుకుంటే ఇటువంటి ప్రమాదాలు జరగకుండా చూడవచ్చు.
8 జాగ్రత్తలు తప్పనిసరి..!
వానాకాలంలో నేల తడిసి ఉండడంతో విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రజలే జాగ్రత్తగా ఉండాలి. తడి చేతులతో విద్యుత్ పరికరాలు ముట్టుకోవడం, విద్యుత్ స్తంభాలను ముట్టుకోవడం, స్తంభాల వద్ద ఫ్యూజ్‌లు పోతే స్వంతంగా వేసుకోవడం వంటివి చేయరాదు. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చిన తర్వాతే రిపేర్ చేయాలి. విద్యుత్తుకు సంబంధించి ప్రజలు అవగాహన పెంచుకుని జాగ్రత్తగా ఉంటే ప్రమాదాలు నివారించవచ్చు.
8 ఇళ్లలో జాగ్రత్తలు..!
తడి చేతులతో విద్యుత్ స్విచ్‌లను ఆన్, ఆఫ్ చేయరాదు.
ఇంటి, బయట ఉండే లైట్లను నీటిలో తడవకుండా చూసుకోవాలి.
ఇంటిలో ఫ్యాను మెల్లిగా తిరిగితే అందులో కొంత భాగం వైరింగ్ కాలిపోయినట్లుగా గుర్తించి దాన్ని రిపేర్ చేయించాలి.
రేకుల షెడ్లలో కరెంటును బిగించేటప్పుడు నేరుగా బిగించకుండా పివిసి పైపులు, కర్రబోర్డులను వాడి బిగించాలి.
ఇనుప వైర్లతో బట్టలు ఆరేసుకునే దండాలను కట్టుకోవద్దు. ఒక వేళ కట్టి ఉంటే ఆ రెండు చివర్లకు ఎక్కడైనా విద్యుత్ దానికి సరఫరా అయ్యి ఎర్త్ వచ్చే అవకాశాలున్నాయా పరిశీలించాలి.
ఇంటిలో ఏదేనికైనా కనెక్షన్ ఇచ్చిన పొడుగాటి వైర్లు ఉన్నా, చుట్టి పెట్టినా వాటిని ముట్టుకోవద్దు. ఆ వైర్లపైనా ఉండే స్లీవ్ రాక్కపోవడం వల్ల గానీ, ఎలుకలు కొరకడం వల్ల గానీ పోయి ఉండే ప్రమాదం ఉంది. చేతితో తాకే సమయంలో వాటిని చాలా సూక్ష్మంగా పరిశీలించాలి.
సర్వీసు వైర్లను, వీధి దీపాలను సవరించేందుకు విద్యుత్ స్తంభాలు ఎక్కవద్దు.
ఎవరైనా విద్యుదాఘాతానికి గురైతే దగ్గర ఉన్నవారు ప్రమాదాలకు గురైన వారిని రక్షించాలన్న ఆతృతతో ముట్టుకోవద్దు.
షాక్‌కు గురైన వ్యక్తిని వేరు చేయడానికి విద్యుత్ ప్రవహించని వస్తువులను ఉపయోగించాలి. అలాంటప్పుడు విద్యుత్‌ను వెంటనే నిలిపి వేయాలి.
8 రైతులు జాగ్రత్తలు పాటించాలి..!
బావుల వద్ద మోటార్లు తడవకుండా చూసుకోవాలి.
మోటార్‌కు ఎర్త్ తప్పని సరిగా అమర్చాలి.
మోటార్లకు విద్యుత్ సరఫరా చేసే సర్వస్ తీగ తెగిపోతే ప్రమాదం పొంచి ఉంటుంది. సర్వీస్ తీగ జాయింట్లు పోకుండా చూసుకోవాలి.
రైతులు ఇనుప స్టార్టర్ బాక్సులతో విద్యుత్ ప్రమాదాలకు గురవుతున్నారు. వీటికి బదులుగా ప్లాస్టిక్ పివిసి బాక్సులు ఉపయోగించుకుంటే ప్రమాదాలను అరికట్టవచ్చు.
విద్యుత్ స్తంభాలకు సఫోర్ట్‌గా ఉండే తీగలను ఎప్పుడూ ముట్టుకోవద్దు. వర్షం కురిసే సమయంలో అసలే వద్దు.
పశువులను విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్లకు సపోర్ట్ తీగల వద్దకు వెళ్లకుండా చూసుకోవాలి.
గాలి, దుమారం, వర్షం వల్ల తెగిన విద్యుత్ వైర్లను ముట్టవద్దు.
హెచ్‌టీ ఫ్యూజ్, ఎల్‌టీ ఫ్యూజ్ మార్చేందుకు విద్యుత్ అధికారుల అనుమతితో మాత్రమే ట్రాన్స్‌ఫార్మర్లను ఎక్కాలి.
8ఇవి తడవకుండా చూసుకోవాలి..!
సెల్‌ఫోన్లు తడవకుండా చూసుకోవాలి. తడిసిన ఫోన్‌ను చార్జీంగ్ పెట్టకుండా వెంటనే బ్యాటరీ తొలగించి ఆరబెట్టాలి.
ఉరుములు, మెరుపులతో వర్షం కురిసినప్పుడు టీవి, కంప్యూటర్లు ఆఫ్ చేసుకోవాలి. వెంటనే డిష్ కనెక్షన్‌ను తొలగించాలి. ఆన్‌లో ఉంటే షార్ట్ సర్కూట్‌తో కాలిపోతాయి.
వానాకాలంలో చాలా మంది ఫ్రిజ్‌లు వాడరు. వాడకపోతే పైపులు మూసుకుపోతాయి. ప్రతి వారానికి ఒక్కసారైనా ఫ్రిజ్‌ను ఆన్ చేసి వాడితే మంచిది.
కెమెరాలు, ల్యాప్‌టాప్‌లు వర్షానికి తడిస్తే లోపలి భాగాలు పాడవుతాయి. అవి తడవకుండా కవర్లు వాడాలి.
8 విద్యుత్ శాఖ తీసుకునే చర్యలు..!
వర్షాలకు ప్రమాదాలు జరిగే అవకాశాలుంటాయని ఉన్నతాధికారులు ముందస్తుగా సిబ్బందిని అప్రమత్తంగా ఉండాలనీ ఆదేశిస్తారు.
విద్యుత్ స్తంభాలు విరిగిపోయినా. పడిపోయినా సిబ్బందికి గానీ సంబంధిత అధికారులకు గానీ తెలియజేస్తే వెంటనే ఆ స్థానంలో పునరుద్ధరణ పనులు చేపడతారు.
ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోతే అధికారులకు తెలియచేసిన అనంతరం గ్రామీణ ప్రాంతాలకు అయితే 43 గంటలు, పట్టణ ప్రాంతాలకు అయితే 24 గంటల్లో మరమ్మతులుచేపట్టి విద్యుత్ సరఫరా పునరుద్ధరిస్తారు.
సమస్యలుంటే టోల్ ఫ్రీ నంబర్ 18004250025కి కాల్‌చేసి తెలియచేయాలి.
8 గ్రామీణులు జాగ్రత్తలు తీసుకోవాలి..!
జోగానంద్ ఏఈ ట్రాన్స్‌కో మహాముత్తారం.
వానాకాలంలో విద్యుత్ ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. ప్రమాదం జరిగినప్పుడు విద్యుత్ శాఖలో సంబంధిత అధికారులకు తెలియచేయాలి. ప్రమాదం పొంచిఉన్నదంటే వెంటనే తెలియ చేయాలి.