మన తెలంగాణ/మహబూబాబాద్ ప్రతినిధి: ఈనెల 26న కరీంనగర్‌లో జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులకు ముఖ్యమంత్రి కెసిఆర్‌తో సమావేశం ఏర్పాటుచేశారని, ఈ కార్యక్రమానికి సమితి సభ్యులను తీసుకెళ్లేందుకు జాయింట్ కలెక్టర్ వ్యవసాయ అనుబంధ అధికారులకు సమీక్ష నిర్వహించి దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ మండల, జిల్లా రైతు సమన్వయ సమితి సభ్యులను తీసుకువెళ్ళేందుకు వ్యవసాయ విస్తరణాధికారులు ప్రణాళికాబద్దంగా వ్యవహరించి క్రమశిక్షణతో సభ్యులను తీసుకువెళ్ళాలని సూచించారు. ఈ సమావేశంలో బస్సుల ఏర్పాటు, నిర్ధేశించిన ఖచ్చితమైన సమయానికి సభ్యులను తీసుకువెళ్ళడం అంశాలపై ఆయన సూచనలిచ్చారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతు సమన్వయ సమితులను ఏర్పాటుచేయడం జరిగిందని, రైతు సమితి మండల సభ్యులు, జిల్లా సభ్యులు అందరూ తప్పక హాజరయ్యే విధంగా చూడానలి వ్యవసాయాధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కమీషరేట్ కార్యాలయం నుండి ప్రత్యేక అధికారి శివప్రసాద్ హాజరయ్యారు. కార్యక్రమ ప్రణాళికను తయారుచేసే విధంగా అధికారులను కోరారు. అధికారులు సమన్వయంతో పనిచేయాలని ముఖ్యమంత్రి సమావేశం విజయవంతం చేయాలని ఆదేశించారు. జిల్లా వ్యవసాయాధికారి బి.ఛత్రునాయక్ మాట్లాడుతూ ఆర్‌టిసి బస్సులను ఏర్పాటుచేయడం జరిగిందని, రూట్‌మ్యాప్ గురించి అధికారులను సంప్రదించి ఖారు చేసినట్లు తెలిపారు. ఈ సమావేశం గురించి ఎమ్మెల్యే, ఎంపి, ఎంఎల్‌సి, జెడ్పీ చైర్మన్, మార్కెట్ చైర్మన్‌లను సమాచారం అందించాలని అధికారులకు ఆదేశించారు. ఈ సమీక్షలో జిల్లా హార్టీకల్చర్ అధికారి సూర్యనారాయణ, ఎడిఏలు లక్ష్మినారాయణ, గౌస్‌హైదర్,, జిల్లా ఎఒ కార్యాలయం ఏడిఏ రాజనరేందర్, మార్కెటింగ్ అథికారిణి సురేఖ, మండల వ్యవసాయాధికారులు, విస్తరణాధికారులు పాల్గొన్నారు.
26న రైతు సమన్వయ సమితి సభ్యుల సమావేశం
- Advertisement -
- Advertisement -