Home తాజా వార్తలు దంతనూర్ వాగులో మొసలి లభ్యం..

దంతనూర్ వాగులో మొసలి లభ్యం..

Crocodile

మదనాపురం ః మండల పరిధిలోని దంతనూర్ గ్రామ శివారు సమీపంలో గల వాగులో మొసలి లభ్యమైంది. గురువారం రైతులు పంట పొలాల్లో ముళ్ల పొదలు లేకుండా చదును చేశారు. ఈ క్రమంలో రైతులకు మొసలి కన్పించింది. దీంతో రైతుులు మొసలిని పట్టుకొని జూరాల జలాశయంలో వదిలినట్లు పోలీసులు తెలిపారు. గ్రామస్థుల సహాయంతో అటవీశాఖ అధికారులు మొసలి పట్టుకొని జూరాల జలాశయంలో వదిలినట్లు అటవీ శాఖాధికారులు తెలిపారు. ఫారెస్ట్ రేంజ్ అధికారులు రవీందర్‌రెడ్డి, సెక్షన్ అధికారి ప్రశాంత్‌రెడ్డి, శ్రీనివాసులు, , విఆర్‌ఒ అభిలాష్, ఎస్‌ఐ రంగస్వామి,సర్పంచ్ పద్మ, రైతులు ఉన్నారు.

Farmers FindOut Crocodile in Danthanuru stream