Saturday, April 20, 2024

ఎంపి బండి సంజయ్ ఎక్కడ?

- Advertisement -
- Advertisement -

Farmers Fires on BJP President Bandi Sanjay

 ఏడాదిగా పత్తాలేరని ఆగ్రహం
ఆచూకీ తెలిపితే పాదయాత్రగా వచ్చి కలుస్తామన్న రైతులు
ఆసీఫ్‌నగర్‌లో నిరసన దీక్ష

కరీంనగర్: బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్‌కుమార్ తీరుపై అన్నదాతలు ఆగ్రహించారు. ఎన్నికల సమయంలో తనను గెలిపిస్తే గ్రామ అభివృద్ధికి సహకరిస్తానని హామీ ఇచ్చారని, ఆ తరువాత కనిపించడం లేదని మండిపడ్డారు. ఎంపీ తీరుకు నిరసగా రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులు నిరసన దీక్ష చేపట్టారు. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కొత్తపల్లి మండలం, ఆసీఫ్ నగర్ (బావుపేట)కు చెందిన రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులు సోమవారం కరీంనగర్ ఎంపి బండి సంజయ్ కుమార్ కనిపించడం లేదంటూ గ్రామ ప్రధాన కూడలిలో టెంట్ వేసుకొని నిరసన దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ గత పార్లమెంట్ ఎన్నికల్లో తమ గ్రామాన్ని సంజయ్‌కుమార్ సందర్శించారని, ఆ సమయంలో గ్రామాభివృద్ధికి, రైతులకు పలు హామీలు ఇచ్చారని తెలిపారు. ఎంపిగా గెలిచి ఏడాది అవుతున్నా మా గ్రామం వైపు కన్నెత్తి కూడా చూడడం లేదని ఆరోపించారు. ఎంపి ఎక్కడ ఉన్నరో జాడ తెలిపితే పాదయాత్రగా వెళ్లి కలుస్తామని అన్నారు. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో కరోనా వైరస్ ప్రబలినా పట్టించుకోలేదని ఆరోపించారు. లాక్‌డౌన్ కారణంగా ఈ ప్రాంత పేదలు తిండి గింజలు లేక ఇబ్బందులు పడినా ఎంపి పట్టించుకోలేదన్నారు. మా గ్రామ అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదని రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులు ఆరోపించారు.

ఆసీఫ్‌నగర్‌కు రావడానికి ఏమైన ఇబ్బందులు ఉంటే మాకు చెప్పాలని, తామే పాదయాత్రగా వచ్చి ఎంపిని కలుస్తామని పలువురు తెలిపారు. రైతుల నిరసన విషయం తెలుసుకున్న పోలీసులు దీక్ష ప్రాంతాని కి చేరుకున్నారు. వారితో చర్చలు జరిపారు. ఎంపి సంజయ్‌కుమార్ మా గ్రామానికి ఇచ్చిన మాట నిలుపుకోకపోవడంతో నిరసన తెలుపుతున్నట్లు అన్నదాతు లు వివరించారు. ఎంపి ఆచూకీ తెలిపాని వారు కోరా రు. కార్యక్రమంలో రైతులు, రైతు సమన్వయ సమితి సభ్యులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News