Home వికారాబాద్ చిగురించిన ఆశలు…

చిగురించిన ఆశలు…

Farmers Happy With Rain Fall In Vikarabad District

అన్నదాత ముఖంలో ఆశలు చిగురించాయి. ఖరీఫ్ ప్రారంభంలో వరుణుడు కరుణించిన అనంతరం గత పదిహేను రోజులుగా చినుకు కురవక వేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే బోరున విలపిస్తున్న అన్నదాతకు శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న చిరుజల్లులు కొంత మేరకు ఉపశమనం ఇస్తున్నాయి. వర్షాకాలంలో సైతం మండుతున్న ఎండలతో సతమతమవుతున్న   ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరిపీల్చుకున్నారు. జూన్‌లో సాధారణ వర్షపాతం 91.7 మి.మిలకు గాను జిల్లాలో 86.4 మి.మి మాత్రమే నమోదు అయింది. జూలై మాసంపై రైతులు పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు.

మన తెలంగాణ/రంగారెడ్డి జిల్లా ప్రతినిధి :
అన్నదాత ముఖంలో ఆశలు చిగురించాయి. ఖరీఫ్ ప్రారంబంలో వరుణుడు కరుణించిన అనంతరం గత పదిహేను రోజులుగా చినుకు కురవక వేసిన పంటలు కళ్లముందే ఎండిపోతుంటే బోరున విలపిస్తున్న అన్నదాతకు శుక్రవారం రాత్రి నుంచి కురుస్తున్న చిరుజల్లులు కొంత వరకు ఉపశమనం ఇస్తున్నాయి. వర్షకాలంలో సైతం మండుతున్న ఎండలతో సతమతమవుతున్న ప్రజలకు ఒక్కసారిగా వాతావరణం చల్లబడటంతో ఊపిరిపిల్చుకున్నారు. జూన్‌లో సాదారణ వర్షపాతం 91.7 మి.మిలకు గాను జిల్లాలో 86.4 మి.మి మాత్రమే నమోదు అయింది. జూలై మాసంపై రైతులు పూర్తిగా ఆశలు పెట్టుకున్నారు. సాగు విస్తీర్ణం సైతం గణనీయంగా పడిపోయిందని జూలైలో వరుణుడు పూర్తి స్థాయిలో కరుణిస్తే మాత్రం సాగు విస్తీర్ణం పెరుగుతుందని రైతులు పెర్కొంటున్నారు. జిల్లాలోని ఎడు మండలాల్లో సాదారణ వర్షపాతం కన్న అధికంగా నమోదు కాగా 13 మండలాల్లో సాదారణ వర్షపాతం నమోదయింది. మంచాల, సరూర్‌నగర్, చెవెళ్ళ, శంకర్‌పల్లి, మొయినాబాద్, శంషాబాద్, గండిపేట్ మండలాల్లో సాదారణ వర్షపాతం కన్న తక్కువగా నమోదయింది. శుక్రవారం ఆర్థరాత్రి నుంచి జిల్లా వ్యాప్తంగా జల్లులు కురిసిన కల్వకుర్తి, షాద్‌నగర్ నియోజకవర్గాలలో మాత్రం వ్యవసాయంకు అనుకూలంగా వర్షం నమోదయింది. ఆమన్‌గల్ 25.1 మి.మి, ఇబ్రహింపట్నం 2.0 మి.మి, కొందూర్గు 16.9 మి.మి, చౌదరిగూడం 11.8 మి.మి, హయత్‌నగర్ 0.4 మి.మి, ఫరూక్‌నగర్ 19.5 మి.మి, మాడ్గుల 6.2 మి.మి, కేశంపేట్ 20.9 మి.మి, కందుకూర్ 5.1 మి.మి, కడ్తాల్ 14.4 మి.మి, శేరిలింగంపల్లి 0.8 మి.మి, షాబాద్ 1.4 మి.మి, నందిగామ 1.0, యాచారం 1.5 మి.మి, తలకొండపల్లి 16.5 మి.మి, మహేశ్వరం 5.5 మి.మి నమోదు కాగా మంచాల, రాజేంద్రనగర్, చెవెళ్ళ, శంకర్‌పల్లి, మొయినాబాద్, గండిపేట్, శంషాబాద్, కొత్తూర్, బాలాపూర్, సరూర్‌నగర్ మండలాల్లో చిరుజల్లులకు పరిమితమైంది. శనివారం నాడు శివారు మండలాల్లో మినహ ఇతర మండలాల్లో రైతులు చాలా వరకు వ్యవసాయ పనులలో బిజిబిజిగా ఉన్నారు. మేడ్చల్ జిల్లాలో సైతం సాదరణ వర్షపాతం నమోదయింది. శుక్రవారం రాత్రి కురిసిన వర్షంతో గ్రామీణ మండలాల్లో రైతు లు వ్యవసాయ పనులలో మునిగిపోయారు.
వ్యవసాయ పనులకు అనుకూలం
మన తెలంగాణ/వికారాబాద్ జిల్లా ప్రతినిధి : జూలై మాసంలో అడపా దడపా కురుస్తున్న వర్షాలు రైతులకు కాస్త ఊరటనిస్తున్నాయి. ఈనెలలో 220 మిల్లీమీటర్ల సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉన్నది. శుక్రవారం రాత్రి జిల్లాలో మోస్తరు వర్షాలు కురిశాయి. దౌల్తాబాద్ మండలంలో 3.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు జిల్లా అధికార యంత్రాంగం వెల్లడించింది. యాలాల మండలంలో 1.4 సెంటీమీటర్లు, తాండూరులో 1.6, దోమ, పరిగి మండలాల్లో 1.2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మిగిలిన మండలాల్లో 2 నుంచి 8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. మర్పల్లి, మోమిప్‌పేట, నవాబ్‌పేట, కోటపల్లి, కోడంగల్ మండలాల్లో వర్షం కురియలేదు. పూడూరు మండలంలో 2.3, కులకచర్లలో 6.1, బొంరాస్‌పేటలో 8.5, ధారూరులో 4.9, బంట్వారంలో 1.4, పెద్దేముల్‌లో 7.7, బషీరాబాద్ మండలంలో 3.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఖరీఫ్‌లో మిగిలిపోయిన ప్రాంతాలో విత్తనాలు వేసుకున్నారు. జిల్లాలో 18 మండలాలు ఉండగా 1.73 లక్షల హెక్టార్లలో పంట సాగు చేస్తున్నారు. ఖరీఫ్‌లో కంది, పత్తి, పెసర, మినుము, మొక్కజొన్న, వరి పంటలు వేసుకుంటున్నారు. అధికంగా కంది, పత్తి పంటలను లక్ష హెక్టార్ల మేరకు పండిస్తున్నారని అధికారవర్గాల సమాచారం. ఈ తేలికపాటి వర్షాలు పంటలకు మేలు చేకూర్చుతాయని వ్యవసాయశాస్త్రవేత్తలు చెబుతున్నారు. జూలై, ఆగష్టు, సెప్టెంబరు మాసాల్లో ఆశించిన వర్షాలు కురిస్తేనే ఈ పంటలు అధిక దిగబడులు సాధ్యమవుతాయి. జిల్లాలో ఉన్న జలాశయాలకు ఇప్పటి వరకు పెద్దగా నీరు చేరలేదు. కోటపల్లి, జుంటుపల్లి, లఖ్నాపూర్ మధ్యతరహా ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో కోటపల్లి ప్రాజెక్టు నీటి సామర్థం 24 అడుగులు ఉండగా 9,200 ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. జుంటుపల్లి, లఖ్నాపూర్ ప్రాజెక్టుల కింద 2 వేల చొప్పున భూములు ఉన్నాయి. ఆగష్టు, సెప్టెంబరు మాసాల్లో పారే వరదలకు ప్రాజెక్టుల్లోకి భారీగా నీరు చేరుతుంది.