Thursday, April 25, 2024

నిరసన తెలిపే హక్కు రైతులకు ఉంది: సుప్రీం

- Advertisement -
- Advertisement -

farmers have right to protest but cannot block city

న్యూఢిల్లీ: రైతుల ఆందోళనలపై సుప్రీంకోర్టులో గురువారం విచారణ జరుగుతోంది. కేంద్ర నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలన్న పిిటిషన్లను తరువాత పరిశీలిస్తామన్న సిజెఐ ఆందోళన చేస్తున్న రైతులను ఖాలీ చేయించాలని పిటిషన్ ను సుప్రీం కోట్టివేసింది. అన్నదాతల ఆందోళనల్లో జోక్యం చేసుకోలేమని పిటిషనర్ కు సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిరసన తెలియజేయడం రైతులకు రాజ్యంగం కల్పించిన హక్కు అని కోర్టు పేర్కొంది. ఆందోళనలు ప్రజలకు అసౌకర్యం, ప్రాణ, ఆస్తి నష్టాలకు దారితీయొద్దని హెచ్చరించింది. కేంద్రంతో చర్యల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని రైతులకు తెలిపింది. వ్యవసాయ చట్టాల రద్దుపై దాఖలైన పిటిషన్ లో వాదనలు తరువాత వింటామని ఉన్నతన్యాయస్థానం పేర్కొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News