Home వనపర్తి రైతు భీమాతో.. రైతులకు ధీమా..

రైతు భీమాతో.. రైతులకు ధీమా..

Farmers insurance.. Farmers Said..

బంగారు తెలంగాణకు బాటలు వేస్తున్న సిఎం కెసిఆర్
రైతుబంధు సాయంతో రైతుల కుటుంబాల్లో సంబరాలు
నిరంజన్‌రెడ్డి సమక్షంలో 200 మంది టిఆర్‌ఎస్‌లో చేరిక

మన తెలంగాణ/శ్రీరంగాపురం : బంగారు తెలంగాణలో భాగంగా రైతులకు రైతుబంధు, రైతుభీమా తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రవేశపెట్టడం జరిగిందని, సిఎం రైతులపాలిట ఆపద్భాంధవుడయ్యారని రైతు భీమాతో రైతులకు ధీమా కల్పించారని ,రైతుబంధు సాయంతో రైతులు తమ కుటుంబాల్లో సంబరాలు చేసుకుంటున్నారని రైతుల ముఖాల్లో చిరునవ్వు కనిపిస్తుందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. మండల పరిధిలోని నాగరాల గ్రామంలో సోమవారం కార్యకర్తల సమా వేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దాదాపు 200 మంది కార్యకర్తలు టిఆర్ఎస్లో చేరడం జరిగిందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న పలు సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు, సిసి రోడ్లు, మిషన్‌భగీరథ, ఆసరా, మిషన్‌కాకతీయ ,రైతుబంధు, రైతు భీమా పలు పథకాలకు లోనై సర్పంచ్ వెంకటస్వామి, సర్పంచ్ బక్కయ్య, సర్పంచ్ నిర్మళారాధాకృష్ణ, దాదాపు 200 మంది రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సమక్షంలో టిఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా నిరంజన్‌రెడ్డి మాట్లాడుతూ. . తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి రైతుకు రూ. 5 లక్షల భీమాతో రైతులకు ధీమా కల్గిందన్నారు. వ్యవసాయంపై సిఎం కెసిఆర్ రైతులకు విశ్వాసం,నమ్మకం, కల్గించడం జరిగిందన్నారు. పెట్టుబడి సాయంతో రైతులు తమ పొలాల్లో సిరుల పంటలు పండించాలని కోరారు. పలు సంక్షేమ పథకాలకు ప్రజలు లోనై టిఆర్‌ఎస్‌లో చేరడం జరుగుతుందన్నారు. పార్టీలోకి ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానించడం జరుగుతుందన్నారు. అనంతరం టిఆర్‌ఎస్ పార్టీ లోకి కండువాలు కప్పి కార్యకర్తలను నిరంజన్‌రెడ్డి ఆహ్వానించారు. టిఆర్‌ఎస్ పార్టీ అభివృద్ధికై కార్యకర్తలు ,నాయకులు, కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్ జలీల్, పృథ్వీరాజ్, పర్వతాలు, గౌడ్‌ నాయక్, వహీద్దిన్, నవీన్‌రెడ్డి, డైరెక్టర్ రాజశేఖర్ యాదవ్, హరిశంకర్ నాయుడు, విశ్వరూపం,పర్వతాలు, తదితరులు ఉన్నారు.