Home కరీంనగర్ ఆగస్టు నుండి రైతు బీమా

ఆగస్టు నుండి రైతు బీమా

Farmers insurance from August

రైతన్న సంక్షేమానికి అనేక పథకాలు
ఆత్మగౌరవంతో తలెత్తుకొని బతికేలా.
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్

మనతెలంగాణ/కరీంనగర్‌ : ముఖ్యమంత్రి రైతుల సమస్యల తెలిసిన వారు కనుక రైతు సమస్యల పరిష్కారానికి అనేక పథకాలు ప్ర వేశపెడుతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. సోమవారం కరీంనగర్‌లో వ్యవసాయాధికారులు, రైతు సమన్వయ సమితి గ్రామ, మండల, జిల్లా కో-ఆర్డినేటర్లతో రైతు బంధు జీవిత బీమా పథకంపై నిర్వహించిన అవగాహన సదస్సుకు రాష్ట్ర పౌ ర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్, రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్త సుఖేందర్‌రెడ్డి కలిసి వ్యవసాయ శాఖ మంత్రి స మీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మ ంత్రి మాట్లాడుతూ ఆగస్టు 15నుంచి అమలు చేయనున్న రైతు బంధు బీమా పథకం నామినేషన్ ఫారాలను జూన్ నెలాఖరులోగా పూరించి ప్రభుత్వానికి పంపాలన్నారు.రైతులు అప్పులపాలు కావద్దని, సమాజ ంలో రైతులందరూ ఆత్మగౌరవంతో తల ఎత్తుకుని తిరగేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించి ముందుకు సాగుతుందన్నారు. రైతుబంధు జీవిత బీమా పథకాన్ని ఆగస్టు 15 నుండి రాష్ట్రంలో అమలులోకి తెస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మందికి రైతు బీమా పథకం అమలు చేయనున్నామని తెలిపారు.రైతు ఆకస్మాత్తుగా లేదా సాధారణ మరణం పొందినా రూ.5 లక్షల కుటుంబానికి అందుతాయని తెలిపారు. ఈ రైతు బీమా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.1100 ఖర్చు చేస్తుందని తెలిపారు. రైతు బీమా నామినేషన్ ఫారాలను వ్యవసాయ విస్తరణ అధికారులు ఇంటింటికి వెళ్లి రైతు నామిని పేరు, రైతు సం తకం తీసుకుని కలెక్టర్ల ద్వారా బీమా ప్రతిపాదనలు పంపాలని ఆయ న సూచించారు.మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ రైతు త్యాగమూర్తి అని, రైతు రాష్ట్ర సంపద, దేశ సంపద అని అన్నారు రైతు ఎడుపు మంచిది కాదని, రైతు సంక్షేమానికి ప్రభుత్వం పె ద్ద పీట వేస్తుందని అన్నారు.రాష్ట్రంలో రైతుల సంక్షేమానికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాల గురించి దేశంలోని అన్ని రాష్ట్రాలలో ప్రభుత్వాలు చర్చించుకుంటున్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 17 వేల లక్షల కోట్ల రుణాలను రైతులకు నాలుగు విడుతలలో మాఫీ చేసిందని తెలిపారు. కరీంనగర్ జిల్లా రాష్ట్రంలోనే అన్ని జిల్లాలలకు నీళ్లను అందించే జిల్లా అని, కరీంనగర్ జిల్లా జలహా రం కాబోతుందని అన్నారు.నాలుగు సంవత్సరాలలో రాష్ట్రానికి 18అవార్డులు సాధించిన తెలంగాణ రాష్ట్రమని అన్నారు. రాష్ట్ర రైతు సమన్వయ సమితి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ రైతాంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారు. 57 లక్షల మంది రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలు, రైతుబంధు చెక్కులు అందించామని 90 శాతం పనులు పూర్తి అయినాయని తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ తుల ఉమ, పార్లమెంట్ సభ్యులు బోయినిపల్లి వినోద్ కుమార్, కరీంనగర్ ఇన్‌చార్జ్ కలెక్టర్ కృష్ణ భాస్కర్, పెద్దపల్లి కలెక్టర్ దేవసేన, శాసన మండలి చీఫ్ విప్ పాతూరి సుధాకర్‌రెడ్డి, శాసన మండలి సభ్యు లు నారదాసు లక్ష్మణ్‌రావు, భాను ప్రసాద్‌రావు, ఎంఎల్‌ఎ గంగుల కమలాకర్, బొడిగే శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, సోమారపు సత్యనాయరణ, పుట్ట మధు, వొడితెల సతీష్‌బాబు, ఐ డిసి చైర్మన్ ఈద శంకర్‌రెడ్డి,మార్కెట్ చైర్మన్ బాపురెడ్డి, గ్రంథాలయ చైర్మన్ ఏనుగు రవీందర్ రెడ్డి, సుడా చైర్మన్ జివి రామకృష్ణరావు, రైతు సమన్వయ సమితి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు  తిరుపతి, పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రాంరెడ్డి, రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షులు గడ్డం నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.