Tuesday, September 26, 2023

హర్యానా సిఎం ఖట్టర్‌కు నిరసన సెగ

- Advertisement -
- Advertisement -

Farmers protest against Haryana CM Khattar

 

నల్లజెండాలతో కాన్వాయ్‌ని అడ్డుకున్న రైతులు

చండీగఢ్: హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు రైతుల నిరసన సెగ తగిలింది. మంగళవారం రోడ్డు మార్గంలో భారీ కాన్వాయ్‌తో అంబాలా వెళ్తున్న ఖట్టర్‌ను అడ్డుకునేందుకు రైతులు ప్రయత్నించారు. వందలాదిమంది రైతులు ఖట్టర్‌కు నల్లజెండాలు చూపి నిరసన తెలిపారు. ఖట్టర్ కాన్వాయ్‌కి మార్గం ఇవ్వాల్సిందిగా రైతులకు నచ్చజెప్పేందుకు పోలీసులు ప్రయత్నించారు. పెద్ద సంఖ్యలో ఉన్న రైతులను అదుపు చేయడం ఇబ్బందిగా భావించిన అధికారులు కాన్వాయ్‌ను వేరే మార్గంలోకి మళ్లించారు. అంబాలా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ప్రచారం కోసం ఖట్టర్ వెళ్తుండగా ఈ సంఘటన జరిగింది. తమ రాష్ట్రంలో కొద్దిమంది రైతులు మాత్రమే కేంద్ర చట్టాల పట్ల అసంతృప్తితో ఉన్నారని ఖట్టర్ ఇటీవల వ్యాఖ్యానించారు. డిసెంబర్ 1న అంబాలాలోని ఓ గ్రామంలో కేంద్రమంత్రి రతన్‌లాల్ కటారియాకు కూడా రైతుల నుంచి నిరసన సెగ తగిలింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News