Home జోగులాంబ గద్వాల్ ఖరీఫ్ సాగుకు… రంగం సిద్ధం

ఖరీఫ్ సాగుకు… రంగం సిద్ధం

Kharifగద్వాల ప్రతినిధి : వర్షాకాలం వచ్చేస్తుంది. ఖరీప్ సాగుకు రైతన్నలు సమాయప్తం అవుతున్నారు. ఇప్పటికే రైతులు తమ వ్యవసాయ పనులను ప్రారంభించారు. దుక్కులు దున్ని పొలాలను సేద్యం చేసేందుకు సిద్దం చేసుకుంటున్నారు. మరికొందరు రైతులు బోర్ల కింద సిడ్ పత్తి విత్తనాలను నాటేశారు. గత సంవత్సరంలో అనుకున్న మేర వర్షాలు కురువక పోవడంతో మెట్ట పంట రైతన్నలు కొంత నష్టం పోయారు. ఈ సారైనా వరణుడు కరుణిస్తాడేమోనన్న ఆశతో రైతులు ఉన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లాలో మొత్తం 1,54 వేల మంది రైతులు వ్యయసాయం చేస్తున్నారు. అందులో వరిని 15,268హెక్టార్‌లు , వెరుశేనగను 7,5,74హెక్టార్‌లు, కందులు 15,126హెక్టార్‌లు, అందలు 16,316హెక్టార్, పత్తి 50 వేల హెక్టార్‌లు, సజ్జలు 1366హెక్టార్‌లు, మిరప 9676హెక్టార్‌లు, మొక్కజోన్న 7052హెక్టార్‌లల్లో సాగు చేసేందుకు సిద్దం అవుతున్నారు. జిల్లాలో ఎక్కువగా వర్షాధార అధారంగానే వ్యవసాయన్ని చేస్తున్నారు. మెట్ట పంట మొత్తం కేవలం వర్షంపైనే ఆధారపడి ఉంటుంది. ఒక వేళ వర్షాలు కురువకపోతే రైతన్నలు తీవ్రంగా నష్ణపోయే అవకాశం ఉంది.
*విత్తనాలు సిద్దం … జిల్లాలో రైతులకు కావల్సిన విత్తనాలను అందుబాటులో ఉంచామని వ్యవసాయశాఖ జిల్లా అధికారి గోవిందు నాయక్ తెలిపారు. వరి విత్తనాలు 5వేల క్వింటాల్, కందులు 130క్వింటాల్, అముదాలు 15వందల క్వింటాల్, వేరుశేనగ 300క్వింటాల్, సజ్జలు 170క్వింటాల్ విత్తనాలు అవసరం పడుతాయని ఆయన చెప్పారు. అదేవిధంగా 4500క్వింటాల్ జిలుగా విత్తనాలను సిద్దంగా ఉంచుకోవడం జరిగిందన్నారు. ఈ ఏడాది ఎరువుల, విత్తనాల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. గత ఏడాది ఖరీప్‌లో 1,37,211ఎకరాలలో పంట సాగు చేశారని , ఈసారి అంతకంటే ఎక్కువశాతంలో పంట సాగు చేసే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
*జిల్లాలో సీడ్ పత్తిదే హవా.. జోగుళాంబ గద్వాల జిల్లా సీడ్ పత్తినే రైతన్నలు ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాదాపు సగానికి పైగా రైతులు సీడ్ పత్తిని పండిస్తున్నారు. దీంతో ఎక్కువగా ఇతర పంటలను పండించడానికి ఇష్టపడారు. ఆర్గనైజర్లు గ్రామగ్రామాన ఉంటడంతో సీడ్ పత్తిని ఎక్కువగా సాగు చేస్తున్నారు. కంపెనీలు , ఆర్గనైజర్ల ద్వారా పంటకు ముందే డబ్బులు ఇస్తుండంతో సీడ్‌పత్తి సాగుకు రైతన్నలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.

Farmers Ready For Kharif Cultivation