Home నిర్మల్ రైతుల త్యాగం మరువలేనిది: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

రైతుల త్యాగం మరువలేనిది: మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి

Nirmal-image

మన తెలంగాణ/నిర్మల్ : జిల్లాలో 1లక్ష ఎకరాల ఆయకట్టుకు నీరందించేందుకు చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ 27, 28 ప్యాకేజీల నిర్మాణం పనులను భూములు ఇచ్చిన రైతుల త్యాగం వెలకట్టలేదని రాష్ట్ర గృహనిర్మాణ, న్యాయ, దేవాదాయ శాఖమంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని వైఎస్‌ఆర్ ఫంక్షన్‌హాల్‌లో కాళేశ్వరం ప్యాకేజీ నెంబర్ 27లో భూములు కోల్పోయిన రైతులకు భూనష్టపరిహారం చెక్కులపంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొ ని పంపిణీ చేశారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ 27వ, 28వ ప్రాజెక్ట్ నిర్మాణాలు పూర్తయితే జిల్లాలోని 1లక్ష ఎకరాల ఆయకట్టుకు సాగునీరందించవచ్చని తెలిపారు. అనంతరం 375 మంది రైతులకు రూ.19కోట్ల 9లక్షల 36వేల చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ సమితి కో ఆర్డినేటర్ వెంకట్‌రామ్‌రెడ్డి, ఎఫ్‌ఎస్‌సిఎస్ చైర్మన్ రాంకిషన్‌రెడ్డి, ఎఎంసి చైర్మన్‌లు దేవేందర్‌రెడ్డి, రాజ్‌మహ్మద్, ఆర్‌డిఒ ప్రసునాంబ పాల్గొన్నారు.